Tollywood: వియ్యం అందుకోనున్న ఆ రెండు కుటుంబాలు.. పెళ్లి ఎప్పుడంటే..!

తెలుగు సినీ ఇండస్ట్రీలోని కుటుంబాలు వియ్యం అందుకున్న సందర్భాలు ఉన్నాయి. అప్పట్లో రామానాయుడు, నాగేశ్వ రావు వియ్యంకులయ్యారు. తాజాగా చిత్రపరిశ్రమకు చెందిన రెండు పెద్ద ఫ్యామిలీలు వియ్యం అందుకోనున్నాయి. ఆ పెద్ద కుంటుబాలలో ఒకటి నిర్మాత, నటుడు మురళీ మోహన్ ఫ్యామిలీ. మరో బిగ్ ఫ్యామిలీ ఎంఎం కీరవాణి కుటుంబం. ఇప్పుడు ఈ రెండు కుంటుబాలు వియ్యం అందుకోబోతున్నట్లు తెలుస్తోంది.

మురళి మోహన్ మనవరాలిని కీరవాణఇ కొడుకు, హీరో శ్రీ సింహకు ఇచ్చి పెళ్లి చేయనున్నారు. ఈ విషయాన్ని మురళి మోహన్ ధ్రువీకరించారు. తాజాగా ఈ వివాహంపై మురళి మోహన్ కోడలు మాగంటి రూప మట్లాడారు. రూప ఓ ఇంటర్వ్యూలో పెళ్లి విషయాన్ని ధ్రువీకరించారు.‌ కీరవాణి కుమారుడు శ్రీ సింహతో తన కూతురు రాగ వివాహం నిశ్చయించినట్లు తెలిపారు. మురళీ మోహన్ సినీ పరిశ్రమంలోకి వచ్చి 50 ఏళ్లు పూర్తి చేసుకున్నారు.

Keeravani Son Sreesimha and Murali Mohan s grand daughter Raga will get married

ఈ సందర్బంగా ఆయన, ఆయన కోడలు ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానల్ వచ్చే ప్రొగ్రామ్ లో పాల్గొన్నారు. ఈ సంవత్సరం ఆఖరులో వివాహం జరుగుతోందని చెప్పారు. మురళీ మోహన్‌కు ఒక కూతురు, ఒక కుమారుడు ఉన్న సంగతి తెలిసిందే. కొడుకు రామ్ మోహన్ తండ్రి వ్యాపారాలను చూసుకుంటున్నాడు. కుమార్తె విదేశాల్లో స్థిరపడ్డారు. రామ్‌ మోహన్‌, రూప దంపతులకు కూతురు రాగ ఉన్నారు. రాగ విదేశాల్లో చదివారు. ఆమె ప్రస్తుతం తండ్రితో పాటే కుటుంబ వ్యాపారాలు చూసుకుంటున్నారు.

కీరవాణి కొడుకు శ్రీసింహ యమదొంగ సినిమాలో బాలనడిగా పరిశ్రమలోకి అడుగు పెట్టారు. మత్తు వదలరా సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఆ తర్వాత తెల్లవారితే గురువారం, దొంగలున్నారు జాగ్రత్త, ఉస్తాద్‌ సినిమాల్లో చేస్తున్నాడు. శ్రీసింహ, రాగ ప్రేమించికున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+