50 లక్షలతో తీస్తే 120 కోట్లు వసూళ్లు.. హీరో ఎవరో తెలిస్తే షాక్ అవుతారు..!
ఇటీవలికాలంలో చిన్న సినిమాలదే హవా నడుస్తోంది. భారీ బడ్జెట్ సినిమాలు ప్రేక్షకుల్ని అలరించడంలో ఫెయిల్ అవుతున్నాయి. కారణం ఏంటంటే..? ఆ సినిమాలపై ఆడియన్స్ విపరీతమైన ఆశలు పెట్టుకోవడమే.. దాంతో ఆ అంచనాలను అందుకోలేక చాలా పాన్ ఇండియా సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఢమాల్ అవుతున్నాయి. అయితే చిన్న సినిమాలకు అలాంటి ప్రాబ్లెమ్ లేదు. ఎలాంటి అంచనాలు లేకుండానే ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేస్తున్నాయి. కంటెంట్ కరెక్ట్ గా ఉంటే చిన్న సినిమానా పెద్ద సినిమానా అని ప్రేక్షకులు చూడరని మరోసారి రుజువైంది.
అయితే ఇటీవలి కాలంలో ఓ సినిమా సంచలనంగా మారింది. కేవలం రూ. 50 లక్షల బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కించారు. అయితే బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ ఏకంగా రూ. 120 కోట్ల వసూళ్లు రాబట్టింది. అదే గుజరాతీ సినిమా 'కృష్ణ సదా సహాయతే'.. ఈ మూవీ గుజరాతీ ఫిల్మ్ ఇండస్ట్రీలో రూ. 100 కోట్లు కొల్లగొట్టిన తొలి చిత్రంగా సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. సాధారణ ఆటో డ్రైవర్ కథలో శ్రీ కృష్ణుడి రిఫరెన్స్.. భావోద్వేగాల కలయికతో ఈ మూవీ ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. థియేటర్లలో విజయవంతంగా ఆడిన ఈ సినిమా ఈ నెల 6 నుంచి సోనీలివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
గుజరాతీలో రూపొందిన 'కృష్ణ సదా సహాయతే' సినిమా 2025 అక్టోబర్ 10వ తేదీన విడుదలైంది. ఈ మూవీలో రీవా రిచ్, శ్రుహాద్ గోస్వామి, కరణ్ జోషీ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఇక ఈ చిత్రానికి అంకిత్ సఖియా దర్శకత్వం వహించారు. ఈ మూవీకి స్మిత్ జె సంగీతాన్ని అందించారు. ఎలాంటి భారీ అంచనాలు లేకుండా విడుదలైన ఈ మూవీ ప్రేక్షకుల ఆదరణతో అఖండ విజయాన్ని అందుకుంది. చిత్ర నిర్మాతకు ఏకంగా 200 రెట్ల లాభాన్ని తెచ్చిపెట్టింది. కథలో కంటెంట్ ఉంటే చాలు సినిమా బ్లాక్ బస్టర్ అని నిరూపించింది ఈ సినిమా..

ఇక గుజరాతీ ఫిల్మ్ ఇండస్ట్రీలో తొలిసారిగా రూ. 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన సినిమా ఇదే కావడం విశేషం. ఈ మూవీలో ఎలాంటి స్టార్ హీరోలు లేరు. అలాగే స్టార్ హీరోయిన్లు కూడా లేరు. ఇక భారీ గ్రాఫిక్స్ కూడా లేకుండానే ఈ మూవీ విజయాన్ని సాధించింది. అయితే ఈ మూవీకి రియల్ హీరో శ్రీ కృష్ణుడే అని ప్రేక్షకులు చెబుతున్నారు. ఇక ఈ మూవీ కథ విషయానికి వస్తే ఓ సాధారణ ఆటో డ్రైవర్ కు కృష్ణుడి అనుగ్రహం కారణంగా అతని జీవితం ఎలా ప్రభావితమైందనే అంశం చుట్టూ మూవీ నడుస్తుంది. ఈ మూవీ ఈ నెల 6 న ఓటీటీలోకి రానున్న నేపథ్యంలో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
సవాల్ చేసి మరీ అవార్డు కొట్టాడయ్యా..! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !!












Click it and Unblock the Notifications