4600 కోట్ల ఆస్తిపరుడు, తనకన్నా చిన్నవాడితో ప్రభాస్ హీరోయిన్ డేటింగ్!!

బాలీవుడ్ ముద్దుగుమ్మ, టాలీవుడ్ లోనూ తన సినిమాలతో ఆకట్టుకుంటున్న కృతి సనన్ గురించి తాజాగా ఒక వార్త హల్చల్ చేస్తుంది. కృతి సనన్ తనకంటే తొమ్మిదేళ్లు వయసులో చిన్నవాడైన కుర్రాడితో డేటింగ్ చేస్తుందంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. 4600 కోట్ల ఆస్తి ఉన్న కబీర్ బహియాతో కృతి సనన్ డేటింగ్ చేస్తున్నట్టు సినీ ఇండస్ట్రీ వర్గాలలో చర్చ జరుగుతుంది.

కృతి సనన్ పై డేటింగ్ రూమర్స్
వన్ నేనొక్కడినే సినిమాలో మహేష్ బాబు హీరోయిన్ గా నటించిన, ఆది పురుష్ సినిమాలో ప్రభాస్ సరసన నటించిన కృతి సనన్ డేటింగ్ పై ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ నడుస్తుంది. తాజాగా కృతి సనన్ 34 వ ఏడులోకి అడుగు పెట్టింది. కృతి సనన్ తన పుట్టినరోజు వేడుకను గ్రీస్ లోని ఒక ఐలాండ్ లో జరుపుకుంది.

Kriti Sanon is dating with kabir bahia who is younger than her and has 4600 crore property

కృతి సనన్ బాయ్ ఫ్రెండ్ పై ఆసక్తి
ఈ వేడుకలో కృతి సనన్ రూమర్ బాయ్ ఫ్రెండ్ కబీర్ బహియా కూడా పాల్గొన్నారు. ఇక వీరిద్దరి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో నెటిజెన్లు కృతి సనన్ పైన నెట్టింట చర్చ మొదలుపెట్టారు. ప్రస్తుతం కృతి సనన్ డేటింగ్ చేస్తున్న ఈ కబీర్ బహియా ఎవరు అన్నది తెగ వెతికేస్తున్నారు.

కబీర్ బహియా 4600 కోట్ల ఆస్తికి వారసుడు
కబీర్ బహియా యూకే లో ఒక వ్యాపారవేత్త కుమారుడు. కబీర్ తండ్రి కుల్జీందర్ యూకే లో ట్రావెల్ ఏజెన్సీ ని నడుపుతున్నాడు. ఆయన ఆస్తి దాదాపు 4600 కోట్లు అని తెలుస్తుంది. ప్రస్తుతం కృతి సనన్ బాయ్ ఫ్రెండ్ పైన జరుగుతున్న చర్చలో అతను టీమిండియా మాజీ కెప్టెన్ ఎమ్మెస్ ధోని హార్దిక్ పాండ్యాలకు క్లోజ్ ఫ్రెండ్ అని కూడా తెలుస్తోంది.

కృతి, కబీర్ బహియాల డేటింగ్?
ఇక మొహబ్బత్ మ్యూజిక్ వీడియోలతో తన కెరీర్ ను ప్రారంభించిన కృతి సనన్ సోదరి నూపుర్ సనన్ తన అక్కకు కబీర్ ను పరిచయం చేసిందట. దీంతో వారిద్దరి మధ్య అప్పటినుంచి స్నేహం కొనసాగుతుందని ప్రస్తుతం వారిద్దరూ డేటింగ్ చేస్తున్నారని బాలీవుడ్ శ్రేణుల్లో రూమర్స్ వినిపిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+