చివరి నిమిషంలో 'కుబేర' మూవీ టీమ్ బిగ్ షాక్.. వాయిదా వేస్తూ ట్వీట్
ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం కుబేర. ఈ మూవీ జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల కావాల్సి ఉంది. కానీ చివరి నిమిషంలో చిత్ర యూనిట్ బిగ్ షాక్ ఇచ్చింది. గుజరాత్ లోని అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదంలో 265 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనకు సంఘీభావం తెలుపుతూ ఈ మూవీ ప్రీ- రిలీజ్ ఈవెంట్ ను వాయిదా వేస్తూ చిత్ర యూనిట్ కీలక నిర్ణయం తీసుకుంది.
శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న ఈ మూవీలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అంతేకాక ఈ మూవీలో కింగ్ అక్కినేని నాగార్జున.. మునుపెన్నడూ చేయని ఓ వైవిధ్యమైన పాత్రలో నటిస్తున్నారు. దీంతో ఈ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్, అమిగోస్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
కుబేర మూవీ జూన్ 20న తెలుగు, తమిళం, హిందీతోపాటు ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధం కానుంది. దీంతో మూవీని ప్రొమోట్ చేసే పనిలో చిత్ర యూనిట్ ఉంది. ఈ మేరకు ప్రొమోషన్స్ ను ప్రారంభించింది. అయితే అహ్మదాబాద్ విమాన ప్రమాదం నేపథ్యంలో చిత్ర యూనిట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మూవీ ప్రీ- రిలీజ్ ఈవెంట్ ను వాయిదా వేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
ఇక గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఎయిరిండియా విమానం కుప్పకూలిపోయిన ఘటనలో 265 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 229 మంది ప్రయాణికులు కాగా 12 మంది సిబ్బంది దుర్మరణం చెందారు. ఈ ఘటన యావత్ భారత్ నే కాకుండా ప్రపంచ దేశాలను షాక్ కు గురిచేసింది. ఎయిరిండియా బోయింగ్ 787-8 విమానం అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్ సమీపంలోని బీజీ వైద్య కళాశాల భవనంపై పడటంతో మరో 24 మంది వైద్య విద్యార్థులు మృతి చెందారు. ఈ ప్రమాదంలో ఒక్కరు మాత్రమే బతికి బయటపడటం గమనార్హం.

ఈ నేపథ్యంలోనే కుబేర మూవీ టీమ్ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ప్రీ- రిలీజ్ కొత్త డేట్ ను త్వరలోనే ప్రకటించనుంది చిత్ర బృందం. ప్రీ- రిలీజ్ ఈవెంట్ వాయిదా పడిన విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు. ఇక ఇటీవల రిలీజైన ఈ మూవీ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.
-
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే -
Putta Mahesh: టీడీపీ నుంచి ఏలూరు ఎంపీ సస్పెన్షన్ - షర్మిల షాకింగ్ ..! -
పెన్షన్లు పెంపు, మహిళలకు నెలకు రూ 2,500 - అమలు ముహూర్తం..!! -
today rashiphalalu: నేడు మీన సంక్రాంతితో ఈ రాశులవారికి తిరుగులేని అదృష్టం! -
గ్యాస్ బుకింగ్, డెలివరీ ఇక నుంచి ఇలా చేస్తేనే - తాజా మార్గదర్శకాలు..!! -
ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న బంగారం ధరలు -
తెలంగాణ దశను మార్చే బిగ్గెస్ట్ రైల్వే ప్రాజెక్ట్ -
Sunrisers: సన్ రైజర్స్ ను ఆదుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ..! విమర్శల వేళ..! -
పెట్రోల్, డీజిల్ రేట్లపై కేంద్రం రివ్యూ?












Click it and Unblock the Notifications