Fact Check: ఏపీలో డ్వాక్రా రుణాలు తగ్గిపోతున్నాయా ?

ఏపీలో స్వయం సహాయక సంఘాలకు బ్యాంకుల ద్వారా ఇచ్చే రుణాలు నానాటికీ తగ్గిపోతున్నాయంటూ నిన్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. ఇందులో జగన్ గత కొన్నేళ్లుగా డ్వాక్రా సంఘాలకు ఇస్తున్న రుణాలు ఎలా తగ్గిపోతున్నాయో గణాంకాలతో సహా వివరించారు. దీనికి ప్రభుత్వ విధానాలే కారణమని జగన్ ఆరోపించారు. దీనిపై ఇవాళ ప్రభుత్వం ఫ్యాక్ట్ చెక్ (Fact Check) ద్వారా వివరణ ఇచ్చింది.

ఏపీ ఉద్యోగులకు కేబినెట్ గుడ్ న్యూస్- పెన్షన్, రిటైర్మెంట్ పై కీలక నిర్ణయాలు..!
ఏపీ ఉద్యోగులకు కేబినెట్ గుడ్ న్యూస్- పెన్షన్, రిటైర్మెంట్ పై కీలక నిర్ణయాలు..!

రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ నిలబెట్టుకోకపోవడం వల్ల జరిగిన పరిణామాలు అంటూ ఆంధ్రప్రదేశ్‌లో మహిళా స్వయం సహాయక సంఘాల (SHGs) మొత్తం రుణ పోర్ట్‌ఫోలియో తగ్గిందనే తప్పుడు ప్రచారాన్ని కొందరు సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారంటూ ప్రభుత్వం కౌంటర్ ఇచ్చింది. అంకెలు ఎప్పుడూ అబద్ధం చెప్పవని తెలిపింది. కానీ వాటిలో కొన్నింటినే చూపించి ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూడడం కరెక్ట్ కాదని పేర్కొంది.

Fact Check AP Government Refutes Rumours of a Slump in SHG Credit Growth
IAS Sri Lakshmi: ఐఏఎస్ శ్రీలక్ష్మిని కరుణించిన చంద్రబాబు..! రిటైర్మెంట్ వేళ..!
IAS Sri Lakshmi: ఐఏఎస్ శ్రీలక్ష్మిని కరుణించిన చంద్రబాబు..! రిటైర్మెంట్ వేళ..!

కేంద్రం స్వయం సహాయక సంఘాలకు హామీ లేకుండా ఇచ్చే రుణ పరిమితిని రూ 10 లక్షల నుంచి రూ 20 లక్షలకు పెంచిందని, దీంతో మహిళలకు బ్యాంకు రుణాలు మరింత సులభంగా అందుబాటులోకి వచ్చాయని తెలిపింది. దాని ఫలితంగా రుణ పోర్ట్‌ఫోలియో బలంగానే కొనసాగుతోందని తెలిపింది. ఈ లెక్కన గత ఆరేళ్లుగా రుణాల జారీలో వృద్ధి కనిపిస్తోందని గణాంకాలు విడుదల చేసింది. చివరిగా కొన్ని సంవత్సరాల్లో అసాధారణంగా రుణాలు పెరిగిన తర్వాత కొత్త రుణాల వృద్ధి కొంత తగ్గడం సహజమని తేల్చింది. దాన్ని వ్యవస్థ కుప్పకూలిందని చెప్పడం వాస్తవాలకు విరుద్ధమని తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+