పెళ్లైన ఏడాదికి గుడ్ న్యూస్ చెప్పిన మెగా కోడలు
హీరోయిన్ లావణ్య త్రిపాఠి గురించి కొత్తగా పరిచియం చేయాల్సిన పనిలేదు. 'అందాల రాక్షసి' సినిమాతో లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా పరిచియమైంది. తన తొలి సినిమాతోనే అందర్ని ఆకట్టుకుంది లావణ్య త్రిపాఠి. ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోలందరితోనూ లావణ్య త్రిపాఠి నటించింది. ఇక మెగా హీరో వరుణ్ తేజ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఇద్దరి కలిసి రెండు సినిమాల్లో నటించారు. ''మిస్టర్'', ''అంతరిక్షం'' సినిమాల్లో వీరిద్దరు జంటగా కనిపించారు.
Extremely excited to be a part of this project! This story caught my attention with its amazing write-up and solid team. I’m thrilled to be starting this next year
— Lavanyaa konidela tripathhi (@Itslavanya) December 15, 2024
what a fantastic way to kick off the year!
.
.#tatinenisatya @MickeyJMeyer
#binendramenon #kosanamvithal… pic.twitter.com/D0KIddRreI
ఆ సమయంలో ఏర్పడిన పరిచియం ప్రేమగా మారింది. లావణ్య త్రిపాఠితో ప్రేమాయణం సాగించిన వరుణ్ తేజ్.. తమ ప్రేమను పెళ్లి వరకు తీసుకువెళ్లాడు. వీరి పెళ్లికి ఇరు కుటుంబాలు అంగీకరించడంతో..లావణ్య త్రిపాఠి మెగా ఇంటికి కోడలుగా వెళ్లింది. 2023 నవంబర్ 1న వీరిద్దరు ఒకటయ్యారు.పెళ్లి తరువాత వరుణ్ తన సినిమాలతో బిజీగా మారాడు. వరుణ్ తేజ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉండగా, లావణ్య త్రిపాఠి మాత్రం పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంటోంది.

ఆ మధ్య 'మిస్ పర్‌ఫెక్ట్' అనే వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చిది.ఇది డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అయి పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత మరో సినిమాను ఇప్పటి వరకు ప్రకటించలేదు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న లావణ్య తన పర్సనల్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తుంది. ఇక లావణ్య త్రిపాఠి పెళ్లి తరువాత చాలా సెలక్టివ్‌గా సినిమాలు చేస్తోంది. దీనిలో భాగంగానే పెళ్లి అయిన ఏడాది తర్వాత తన కొత్త సినిమాను ప్రకటించింది. 'సతీ లీలావతి' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు లావణ్య త్రిపాఠి ట్వీట్ చేసింది. ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో నటిస్తుండగా,తాతినేని సత్య దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభం కానున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications