500 కోట్ల క్లబ్ లో లియో చేరిక.. లియో స్కామ్: ఏది నిజం?
దళపతి విజయ్ లోకేష్ కనగరాజ్ కాంబోలో దసరా కానుకగా రిలీజ్ అయిన సినిమా లియో. ఈ సినిమా మిశ్రమ ఫలితాలను అందుకున్నప్పటికీ, కలెక్షన్ల విషయంలో ఓ రేంజ్ లో దూసుకువెళుతుందని పెద్ద ఎత్తున చర్చ సాగుతుంది. సినిమా రిలీజ్ అయిన ఆరు రోజుల్లోనే 500 కోట్ల మార్కును దాటేసింది అని చెబుతున్నారు.
నాలుగు రోజుల్లో 400 కోట్ల క్లబ్ లోకి వెళ్ళిన ఈ సినిమా ఆరో రోజుకి 500 కోట్ల క్లబ్లో చేరిందని చెబుతున్నారు. సినిమా విడుదలైన ఆరు రోజుల్లోనే 500 కోట్ల మార్కును దాటిన మొదటి తమిళ సినిమాగా లియో సినిమా గుర్తింపు పొందిందని అంటున్నారు. అయితే లియో సినిమా 500 కోట్ల క్లబ్ లో చేరడం పైన బయట ఆసక్తికర చర్చ జరుగుతుంది.

సోషల్ మీడియాలో లియో సినిమాకు సంబంధించి లియో సినిమా ఒక స్కామ్ అంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఈ సినిమాకు ముందస్తు హైప్ క్రియేట్ చేసి, వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురుస్తుందని లియో గురించి పెద్ద ఎత్తున టాప్ నడుస్తోంది. భారతదేశంలోనే కాకుండా యుఎస్ లో కూడా ఈ సినిమా హంగామా సృష్టిస్తుందని చెప్తున్నారు.
ఏకంగా 18 మిలియన్ డాలర్లకు పైగా ఈ సినిమాకు వసూళ్లు వచ్చినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇక ప్రస్తుతం ఈ సినిమా 500 కోట్ల మార్కు దాటిందని చెబుతున్నారు.కానీ ఈ లెక్కలు తప్పని, ప్రాక్సీ బుకింగ్స్ తో సినిమాకు లేని హైప్ ను క్రియేట్ చేశారని సోషల్ మీడియాలో చర్చిస్తున్నారు . ఇందుకోసం కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లుగా ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.
థియేటర్లలో ఫాస్ట్ ఫిల్లింగ్ మోడ్ చూపించి, ఈ సినిమాకి లేని హైప్ ను క్రియేట్ చేస్తున్నారని, ఇటు తమిళనాడులో సైతం ఈ సినిమాకు వాస్తవంగా వచ్చిన వసూళ్ల కంటే, ఎక్కువ వసూళ్లు వచ్చినట్లుగా ప్రకటించారని చెబుతున్నారు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది అని చెప్పడం కోసమే ఇదంతా జరుగుతుందని, ఇది లియో స్కామ్ అని చెబుతున్నారు.
దీంతో ట్విట్టర్లో లియో స్కామ్ పేరుతో ఒక హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతుంది. అసలు లియో సినిమా 500 కోట్ల క్లబ్లో చేరిందా? లేక లియో స్కామ్ జరిగిందా ? ఏది నిజం అన్నది అర్థం కాక సినీ అభిమానులు గందరగోళానికి గురవుతున్నారు.












Click it and Unblock the Notifications