చరణ్ రేంజ్‌ను పాతరేసిన అనంత శ్రీరామ్.. 50 రోజులు కష్టపడి రాసింది ఈ రోతేనా?
సినీ గీత రచయిత అనంత శ్రీరామ్ పై సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సనాతన ధర్మం, తెలుగు భాషా సంప్రదాయాల గురించి ప్రవచనాలు చెప్పే అనంత శ్రీరామ్.. సినిమాల్లోకి వచ్చేసరికి పక్కా బూతు సాహిత్యాన్ని కుమ్మరిస్తున్నాడంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. గతంలో 'దిగు దిగు దిగు నాగ' అనే భక్తిపాటను కూడా వెకిలిగా మార్చిన చరిత్ర ఆయనకు ఉందని.. ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమా కోసం రాసిన సరికొత్త పాటతో ఆయన తన దిగజారుడు తనాన్ని మరోసారి నిరూపించుకున్నారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.
తాజాగా విడుదలైన ఈ పాటను రాయడానికి అనంత శ్రీరామ్ ఏకంగా 50 రోజులు మెదడు చింపుకుని కష్టపడ్డారట. తీరా చూస్తే ఆ పాటలోని సాహిత్యం రామ్ చరణ్ లాంటి గ్లోబల్ స్టార్ ఇజ్జత్ తీసేలా అత్యంత గలీజుగా ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. వారానికి వెయ్యి రూపాయలు దాచిపెట్టి హోటళ్లకు, దాబాలకు వెళ్లాలనే అర్థం వచ్చేలా.. నిత్యం ఇంట్లో వండే వంట కంటే బయటి ముద్ద రుచిగా ఉంటుందనే తరహాలో భార్యాభర్తల బంధాన్ని, సంసారాన్ని కించపరిచేలా ఈ రోత సాహిత్యం ఉందంటూ నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ పాటలో వాడిన భాష ఏ ప్రాంతానికి చెందిన మాండలికమో అర్థం కాక, చివరకు ఏఐ ప్లాట్‌ఫారాలు సైతం తలలు పట్టుకుంటున్నాయి. ఇది అనంత శ్రీరాముడు సొంతంగా క్రియేట్ చేసిన ఏదో 'కిలికిలి' వెకిలి భాష అయి ఉంటుందని విమర్శకులు ఎద్దేవా చేస్తున్నారు. "రోజూ ఇంట్లో స్నానం చేయడం ఎందుకు, ఎప్పుడైనా నదిలో మునగాలి.. ఎప్పుడూ ఇంటి వంటేనా, దాబా తిండి తినవా" అంటూ రాసిన చరణాలు సమాజానికి ఎలాంటి సందేశాన్ని ఇస్తున్నాయంటూ ప్రశ్నలు కురుస్తున్నాయి.
అయితే ఈ వెగటు సాహిత్యాన్ని సదరు దర్శకుడు నిర్మాత ఎలా అంగీకరించారనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. విచ్చలవిడి బూతును సమాజం మీదికి వదులుతుంటే సెన్సార్ బోర్డు కళ్లు, చెవులు మూసుకుందా అంటూ సోషల్ మీడియాలో నిలదీస్తున్నారు. దేశంలో ప్రజలను పొదుపు చేయమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెబుతుంటే.. సినిమా వాళ్లు మాత్రం వారానికో వెయ్యి తగలేయండి అంటూ ఇలాంటి వెకిలి పాటలతో జనాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారంటూ నెటిజన్లు ఈ పాటపై, రచయితపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు.
సామాజిక మాధ్యమాల్లో 'రాష్ట్రీయ వానరసేన' వంటి పలు హిందూత్వ గ్రూపులు అనంత శ్రీరామ్ ద్వంద్వ వైఖరిని తీవ్రంగా తప్పుబడుతున్నాయి. "సనాతన వాదిగా, హిందుత్వ వాదిగా నటిస్తూ సమాజాన్ని, హిందూ సమాజాన్ని ఇంకెంతో కాలం మోసం చేయలేవు" అంటూ నెటిజన్లు హెచ్చరిస్తున్నారు. ఒకవైపు పవిత్రమైన హిందూ పండుగలు, సంస్కృతి గురించి వేదికలపై సుద్దులు చెబుతూ, మరోవైపు వెండితెరపై భార్యాభర్తల పవిత్ర బంధాన్ని, సంసార జీవితాన్ని కించపరిచేలా.. విచ్చలవిడి బూతును ప్రోత్సహించేలా రాయడం ఆయన నైజానికి అద్దం పడుతోందని మండిపడుతున్నారు. ఈ వివాదంపై అనంత శ్రీరామ్ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక వివరణ ఇవ్వకపోవడంపై నెటిజన్లు మరింత ఫైర్ అవుతున్నారు. తప్పు చేసినప్పుడు నిలబడి సమాధానం చెప్పకుండా, నెటిజన్ల ప్రశ్నలకు భయపడి పారిపోవడం ఆయన బలహీనతను చూపిస్తోందని విమర్శిస్తున్నారు.












Click it and Unblock the Notifications