‘మదరాసి రబ్బరు బొమ్మ’.. ఊరమాస్ రచ్చ!

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కథానాయకుడిగా, సాగర్ కే చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ యాక్షన్ డ్రామా 'టైసన్ నాయుడు'. 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ అచంట, గోపీ అచంట నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రమోషన్లను మేకర్స్ వేగవంతం చేశారు. ఇందులో భాగంగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ 'మదరాసి రబ్బరు బొమ్మ' పాటను చిత్ర బృందం శుక్రవారం రిలీజ్ చేసింది.

పవిత్రమైన రామాయణానికి ఇదేం ప్రమోషన్? వైరల్ అవుతున్న ఫొటోలు!
పవిత్రమైన రామాయణానికి ఇదేం ప్రమోషన్? వైరల్ అవుతున్న ఫొటోలు!

భీమ్స్ సిసిరోలియో ఫోక్ మ్యాజిక్
నేటివిటీ ఉన్న జానపద బాణీలను క్యాచీ బీట్స్ తో అందించడంలో దిట్ట అయిన మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో ఈ పాటను పూర్తి జానపద శైలిలో స్వరపరిచారు. నల్గొండ గద్దర్ నరసన్న, రోహిణి సోరట్ తన విలక్షణమైన గొంతులతో ఈ పాటకు ప్రాణం పోశారు. సురేష్ గంగుల రాసిన సాహిత్యం నవ్వులు పూయిస్తూ.. రొమాంటిక్ అండ్ ప్లేఫుల్ టోన్‌తో శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంటోంది.

Madarasi Rabbaru Bomma Song Unleashes Folk Vibes Tyson Naidu First Single Out Composed by Bheems Ceciroleo
Scene Movie Review: సరికొత్త అవతారంలో సూర్య.. 'సీన్’ మూవీ రివ్యూ!
Scene Movie Review: సరికొత్త అవతారంలో సూర్య.. 'సీన్’ మూవీ రివ్యూ!

బెల్లంకొండ సాయి శ్రీనివాస్-నేహా శెట్టి మాస్ డ్యాన్స్
భారీ సెట్‌లో కలర్ ఫుల్‌గా చిత్రీకరించిన ఈ సాంగ్ విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నేహా శెట్టి సంప్రదాయ జానపద దుస్తుల్లో ఊరమాస్ లుక్‌లో దర్శనమిచ్చారు. వీరిద్దరి మధ్య ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ, మాస్ డ్యాన్స్ మూమెంట్స్ పాటకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. గతంలో విడుదలైన 'టైసన్ నాయుడు' ఫస్ట్ గ్లింప్స్ కు మంచి స్పందన రాగా.. ఇప్పుడు విడుదలైన ఈ ఫోక్ ట్రాక్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+