కొంపముంచిన థమన్.. ఓ రేంజ్‌లో ఏసుకుంటున్నారుగా..!
సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా నటిస్తున్న చిత్రం 'గుంటూరు కారం'. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను హారిక & హాసిని బ్యానర్ మీద చినబాబు నిర్మిస్తున్నారు. ఏ మూహూర్తాన గుంటూరు కారం మొదలు పెట్టారో కాని..ఆది నుంచి సినిమాకు అన్ని అడ్డంకులే. మొదట సినిమా నుంచి హీరోయిన్ పూజా హెగ్డె తప్పుకుంది.ఆ తరువాత గుంటూరు కారం నుంచి కెమెరామ్యాన్ తప్పుకుంటున్నారనే ప్రచారం జరిగింది.
మ్యూజిక్ డైరెక్టర్ థమన్‌పై మహేష్ బాబు అసంతృప్తితో ఉన్నారని..థమన్ కూడా సినిమా తప్పుకుంటున్నారని వార్తలు వచ్చాయి. ఆ తరువాత కథ నచ్చకపోవడంతో గుంటూరు కారం నుంచి ఏకంగా మహేష్ బాబే తప్పుకుంటున్నారని ప్రచారం కూడా జరిగింది. చివరి ఎలాగో కథలో మార్పులు చేర్పులు చేసి.. తిరిగి సినిమాను మొదలుపెట్టారు.

దర్శకుడు త్రివిక్రమ్ పుట్టిన రోజు సందర్భంగా సినిమాలోని మొదటి పాటను మంగళవారం విడుదల చేశారు. అసలు ఈ సినిమా ఫస్ట్ సింగిల్ ఎప్పుడు వస్తుందా ? అని అభిమానులు తెగ అతృతుగా ఎదురు చూశారు. రెండో రోజుల క్రితం వచ్చిన సాంగ్ ప్రొమో అదరగొట్టడంతో.. ఫుల్ సాంగ్ సూపర్ హిట్ అవడం ఖాయం అని మహేష్ అభిమానులు అనుకున్నారు. కాని సాంగ్ బయటకు వచ్చిన తరువాత సాధారణ ప్రేక్షకులే కాకుండా మహేష్ బాబు అభిమానులు కూడా దీనిపై పెదవి విరుస్తున్నారు.

సాంగ్ రిలీజ్ అయినప్పటి నుంచి సోషల్ మీడియాలో మహేష్ అభిమానులే ఈ సాంగ్ పెద్దగా నచ్చలేదని కామెంట్లు చేస్తూ పెదవి విరుస్తున్నారు. సాంగ్ ట్యూన్ కాని, లిరిక్స్ కాని ఏమాత్రం ఆకట్టుకోలేకపోవడంతో మహేష్ ఫ్యాన్స్ థమన్‌ను ఓ రేంజ్‌లో ట్రోల్ చేస్తున్నారు. గుంటూరు కారం ఫస్ట్ సాంగ్‌తో ఫెయిల్ అయిన థమన్ తరువాత అయినా అందరిని ఆకట్టుకునే విధంగా చేస్తారో లేదో చూడాలి.












Click it and Unblock the Notifications