మహేష్ బాబు అభిమానులకు బ్యాడ్ న్యూస్

సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు ఓ బ్యాడ్ న్యూస్. గుంటూరు కారం సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను రద్దు చేస్తున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించారు. ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ రద్దు చేస్తున్నట్టు అఫిషియల్‌గా ఓ నోట్‌ను విడుదల చేశారు. దీనిపై పూర్తి వివరాల్లోకి వెళ్తే..త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం గుంటూరు కారం.

శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమాను హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్.చినబాబు, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. తమన్ సంగీతాన్ని అందించారు. ఈ సినిమాలో మహేష్ బాబు కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ మాస్ క్యారెక్టర్‌లో నటిస్తోన్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకు మంచి రెస్పన్స్ వచ్చింది.ముఖ్యంగా కూర్చీ మడత పెట్టి సాంగ్‌కు ఊహించని స్పందన లభిస్తోంది.

Mahesh babu guntur kaaram movie pre release event cancelled

జనవరి 6న ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహిస్తామని..అప్పుడే సినిమా ట్రైలర్‌ను కూడా విడుదల చేస్తామని చిత్ర నిర్మాత నాగవంశీ తెలిపారు. పైగా ఇప్పటి వరకూ ఏ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ జరగని విధంగా గుంటూరు కారం ఈవెంట్‌ను నిర్వహిస్తున్నామని ప్రకటించారు. ఈ కార్యక్రమాన్ని యూఎస్‌ థియోటర్లలో లైవ్ కూడా ఇస్తున్నామని నాగవంశీ చెప్పుకొచ్చారు.

దీంతో గుంటూరు కారంపై మహేష్ అభిమానుల బోలేడు ఆశలు పెట్టుకున్నారు. కానీ ఎవరూ ఊహించని విధంగా గుంటూరు కారం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ క్యాన్సిల్ అయిందని చిత్ర యూనిట్ ప్రకటించింది. భద్రత సమస్యల కారణంగా గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంటును రద్దు చేస్తున్నాం. ఈ ప్రకటన ద్వారా అభిమానులను మేము హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాము అంటూ ఓ ప్రకటన చేశారు.

ఇది విన్న మహేష్ అభిమానులు పూర్తిగా నిరాశకు గురవుతున్నారు. గుంటూరు కారంపై మొదటి నుంచి నెగిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి. సినిమా నుంచి హీరోయిన్ పూజా హెగ్దె తప్పుకోవడం.. సినిమా కథలో మార్పులు చేయడం, తమన్ తప్పుకుంటున్నారని వార్తలు రావడం ఇలా రకరకాల వార్తలు గుంటూరు కారం సినిమాపై షికార్లు చేశాయి.

దీంతో మహేష్ అభిమానులు ఈ సినిమాపై ఆశలు వదులుకున్నారు. ఇప్పుడు ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ కూడా రద్దు కావడంతో అభిమానులు మరింత నైరాశ్యంలో మునిగిపోయారు. సినిమా అయిన అనుకున్న తేదీకి విడుదల చేస్తారా లేదా చివరి నిమిషంలో హ్యాండ్ ఇస్తారా అని అభిమానులు భయపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+