కోట్ల రూపాయలను ఇస్తానన్నా మహేష్‌బాబు ఒప్పుకోలేదు!!
సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరంలేదు. ఎందుకంటే తెలుగులోనే సినిమాలు చేస్తూ తెలుగు హీరోగానే కొనసాగుతున్నప్పటికీ దేశవ్యాప్తంగా పాన్ ఇండియా హీరోలకు మించిన క్రేజ్ ను సొంతం చేసుకున్నారు. తాజాగా ముకేశ్ అంబానీ చిన్నకొడుకు అనంత్ అంబానీ పెళ్లి వేడుకల్లో పాల్గొన్న మహేష్ బాబుపైనే అందరిచూపు పడింది. ఫొటోగ్రాఫర్లు సింగిల్ గా స్టిల్స్ కావాలంటూ ఒత్తిడిచేసి మరీ ఫొటోలు తీసుకున్నారు. బాలీవుడ్ కు చెందిన సూపర్ స్టార్ల నుంచి దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న హీరోలంతా ఆ వేడుకకు హాజరైనప్పటికీ అందరి దృష్టి మాత్రం మహేష్ బాబుపైనే.
తెలుగులో మాత్రమే చేస్తానని చెప్పిన మహేష్
అంతని చరిష్మాను సొంతం చేసుకున్న ప్రిన్స్ తాను ఇప్పటివరకు అన్నీ నేరుగా ఉండే సినిమాలే చేశారు. ఒక్క రీమేక్ కథలో కూడా నటించలేదు. హిందీలో నటించాలంటూ అక్కడి స్టార్ దర్శకులు, నిర్మాతలు ఎంత ఒత్తిడిచేసినప్పటికీ ఒప్పుకోలేదు. భారీ స్థాయిలో పారితోషికాన్ని ఇస్తామని చెప్పినప్పటికీ వచ్చిన అన్ని ఆఫర్లను సున్నితంగా తిరస్కరించారు. తనకు తెలుగులోనే బాగుందని, తెలుగులోనే సినిమాలు చేస్తానని వారికి చెప్పారు. బాలీవుడ్ లో సినిమాలు చేస్తే ప్రస్తుత సమయానికి వందల కోట్లరూపాయలు సంపాదించేవాడు.

ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో
తాను బాలీవుడ్ కు వెళ్లకపోయినా ప్రస్తుతం తన తాజా సినిమాద్వారా వెళ్లబోతున్నాడు. దుర్గా ఆర్ట్స్ పతాకంపై రాజమౌళి దర్శకత్వంలో నటించబోతున్న చిత్రం పాన్ వరల్డ్ సినిమాగా రూపుదిద్దుకోబోతోంది. ఇందులో అందరూ హాలీవుడ్ నటులే కనిపించబోతున్నారు. మహేష్ కు విలన్ గా తమిళ స్టార్ హీరో విక్రమ్ నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. తెలుగు, తమిళం, కన్నడ, మళయాళం, హిందీ, బెంగాలీ, గుజరాతీ, ఇంగ్లిషు, చైనా, జపాన్, జర్మన్.. తదితర భాషల్లో ఈ సినిమా విడుదల కాబోతోంది. రూ.1500 కోట్ల నుంచి రూ.2వేల కోట్ల బడ్జెట్ తో దీన్ని నిర్మించబోతున్నారు.












Click it and Unblock the Notifications