మహేష్ బాబు "గ్లోబ్ ట్రాటర్" ఈవెంట్ కోసం అంత ఖర్చా.. చిన్న మూవీ తీయొచ్చుగా..!

టాలీవుడ్ మోస్ట్ ప్రెస్టీజియస్ ఫిల్మ్ గా సూపర్ స్టార్ మహేష్‌ బాబు - దర్శకధీరుడు రాజమౌళి కాంబోలో రాబోతున్న చిత్రం "వారణాసి". మహేష్ బాబు కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా నిర్మిస్తున్నారు. దుర్గా ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాత కే.ఎల్. నారాయణ దాదాపు ₹1200 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. మాలీవుడ్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో కనిపించనుండగా.. బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుంది. కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు.

మహేష్ బాబు ఈ చిత్రంలో 'రుద్ర' పాత్రలో నటిస్తున్నారు. ఎద్దుపై కూర్చుని రుద్ర శక్తితో ముందుకు దూసుకెళ్తున్న గ్లింప్స్ ఈవెంట్‌లో విడుదల కాగా అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగిపోయాయి. అలానే గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ఈ చిత్రంలో 'మందాకిని' అనే కీలక పాత్రలో కనిపించనున్నారు. ఆమె ఫస్ట్ లుక్‌లో చీర కట్టులో గన్ పట్టుకుని యాక్షన్ చేస్తూ కనిపించడం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. అలానే నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్. ఆయన 'కుంభ' అనే పాత్రలో కనిపిస్తున్నారు.

mahesh-babu-varanasi-movie-globetrotter-event-budget-news-got-viral

ఇక ఇప్పటికే హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో విశేషంగా 'గ్లోబ్ ట్రోటర్' పేరుతో గ్రాండ్ ఈవెంట్‌ను నిర్వహించింది. అందులో భాగంగానే ఈ చిత్రం టైటిల్ అధికారికంగా అనౌన్స్ చేసి.. గ్లింప్స్ వీడియో రిలీజ్ చేశారు. మహేష్ బాబు ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు. ఈ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నాయి.

అయితే ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో అభిమానులు హాజరయ్యారు. ఈ సందర్భంగా 100 అడుగుల ఎల్ఈడీ స్క్రీన్‌పై గ్లింప్స్ వీడియోను ప్రదర్శించడం ఈవెంట్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అందరూ క్షేమంగా ఇళ్లకు చేరుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ కార్యక్రమం నిర్వహణకు అయిన ఖర్చుపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. ఈ కార్యక్రమానికి సుమారు 15 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు వార్తలు రావడంతో అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.

కేవలం సినిమా టైటిల్ రివీల్ ఈవెంట్ కోసమే ఇంత ఖర్చు చేశారా అని షాక్ అవుతున్నారు. ఈ భారీ మొత్తంతో ఒక చిన్న సినిమానే తీయొచ్చని కామెంట్స్ చేస్తున్నారు. కానీ ఈ భారీ ఖర్చు భారం మొత్తం నిర్మాతపై పడలేదని.. ఈవెంట్ స్ట్రీమింగ్ హక్కులను జియో హాట్‌స్టార్ దక్కించుకుంది. స్పాన్సరింగ్ ప్రకటనల ద్వారా సుమారు ఐదు కోట్ల రూపాయల ఆదాయం వచ్చినట్లు సమాచారం. మిగిలిన ఖర్చును మాత్రమే నిర్మాత తన బడ్జెట్ నుంచి భరించాల్సి వచ్చిందని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+