'వారణాసి' కంటే ముందే మహేష్ నుంచి కొత్త సినిమా.. ఎవరూ ఊహించని విధ్వంసం ఇది..
సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమా వస్తుందంటే చాలు ప్రతి చోటా పండగ వాతావరణం ఉంటుంది. అది కొత్త సినిమా అయినా రీరిలీజ్ అయినా.. మహేశ్ బాబు హీరోగా దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న వారణాసి మూవీ కోసం తెలుగు రాష్ట్రాలు, పాన్ ఇండియా మాత్రమే కాదు.. యావత్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఎదురుచూస్తున్నారు. బిగ్ స్క్రీన్ పై మహేశ్- రాజమౌళి చేసే ఆ మ్యాజిక్ చూడాలని ఉవ్విళ్లూరుతున్నాయి. అయితే వారణాసి చిత్రం కంటే ముందే మహేష్ బాబు నుంచి కొత్త సినిమా రానుంది. ఇదేంటి అని అనుకుంటున్నారా..? అయితే ఈ సినిమాలో మహేశ్ బాబు నటించడం లేదు. అవును మహేశ్ బాబు నిర్మాతగా వ్యవహరించిన ఓ సినిమా ఇప్పుడు రిలీజ్ కు సిద్దమైంది. ఈ విషయాన్ని తాజాగా మహేశ్ ప్రకటించారు.
టాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ ప్రధానపాత్రలో కేరాఫ్ కంచరపాలెం మూవీ దర్శకుడు వెంకటేశ్ మహా ఓ సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఆ మూవీ పేరు రావు బహదూర్. ఈ చిత్రం ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుంది. దాంతో తాజాగా ఈ మూవీ నిర్మాత మహేశ్ బాబు రిలీజ్ డేట్ ను ప్రకటించారు. ఈ మూవీని జూన్ 5 న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లు తెలిపారు. రావు బహదూర్ మూవీ రాజవంశం నేపథ్యంతో సాగే సైకలాజికల్ డ్రామా అని తెలుస్తోంది. ఇక ఇంతకుముందు సత్యదేవ్, వెంకటేశ్ మహా కాంబోలో వచ్చిన ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య మూవీకి ఇది పూర్తి భిన్నమైన సినిమాగా నిలువనుంది.

ఇక ఈ మూవీని సూపర్ స్టార్ మహేష్ బాబుకు సంబంధించిన జిఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో చింతా గోపాలకృష్ణ రెడ్డి, అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ టీజర్, మొదటి పాటకు ఆడియన్స్ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక జూన్ 5 న సినిమా రిలీజ్ కాబోతుంది. ఇక ఇప్పటికే పలు చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు సత్యదేవ్. ఈ మూవీ కోసం ఆయన ప్రాణం పెట్టి పనిచేసినట్లు తెలుస్తోంది. ఇందులో ఆయన విభిన్నమైన వేషధారణల్లో కనిపించనున్నాడు. ఈ మూవీతో సత్యదేవ్ భారీ హిట్ కొట్టాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.












Click it and Unblock the Notifications