మనోజ్ భార్య భూమా మౌనిక రెడ్డికి ఎన్ని వేల రూ.కోట్లు ఉన్నాయో తెలుసా?

మంచు మోహన్ బాబు, అతని రెండో కొడుకు మనోజ్ మధ్య గొడవలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇద్దరూ ఒకరిపై మరొకరు కేసులు పెట్టుకున్నారు. దుబాయ్ లో ఉన్న మంచు విష్ణు కూడా హఠాత్తుగా భారతదేశానికి వచ్చేశారు. తనపై దాడిచేశారని, మనోజ్, కాదు.. తనపై దాడి చేశారని మోహన్ బాబు చెబుతున్నారు. ఈ క్రమంలోనే మోహన్ బాబు ఇంటివద్ద ఓ మీడియా ప్రతినిధిపై మోహన్ బాబు దాడిచేశారు. దీంతో అతనిపై కేసు నమోదు చేశారు. మంచు మనోజ్ భూమా నాగిరెడ్డి-శోభానాగిరెడ్డి రెండో కుమార్తె భూమా మౌనికరెడ్డిని రెండో వివాహం చేసుకున్నారు. ఇది మోహన్ బాబుకు, విష్ణుకు ఇష్టంలేదు. అప్పటినుంచి ఇంట్లో గొడవలు జరుగుతున్నాయని అంటున్నారు.

రూ.2వేలకోట్లకు పైగా
నిరాడంబరంగా మనోజ్ మౌనికరెడ్డిని వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లికి మంచు లక్ష్మితోపాటు కొందరు అతిథులు మాత్రమే హాజరయ్యారు. భూమా మౌనికకు ఆస్తి ఎంత ఉంది? అనే విషయమై ప్రస్తుతం చర్చలు నడుస్తున్నాయి. మౌనికకు రూ.2వేల కోట్లకుపైగా ఆస్తులున్నాయి. ఆమె పేరుపై వాణిజ్య సముదాయాలు, భవనాలు, ఇతర కమర్షియల్ ఆస్తులు చాలావున్నాయి. అలాగే కర్నూలు, ఆళ్లగడ్డ, హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా మౌనిక పేరుపై భారీగా ఆస్తులున్నాయి. వాటి విలువ వందల కోట్లరూపాయలు చేస్తుందని తెలుస్తోంది.

manchu manoj wife mounika reddy property value 2000 crore rupees

భరణం కింద రూ.250 కోట్లు
మనోజ్ ను వివాహం చేసుకోవడానికి ముందు మౌనిక గణేష్ రెడ్డిని వివాహమాడింది. అతను బెంగళూరుతో వ్యాపారవేత్త. వీరిద్దరికీ మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్నారు. అప్పటికే వీరికి ఒక బాబు కూడా ఉన్నారు. వీరిద్దరు విడాకులు తీసుకోవడంతో మౌనికకు భరణం కింద రూ.250 కోట్లు వచ్చాయని తెలుస్తోంది. ఇన్నివేల కోట్లరూపాయల ఆస్తులుండి కూడా ఆస్తుల కోసం మోహన్ బాబుతో మనోజ్ ఎందుకు గొడవపడుతున్నాడని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఆస్తుల విషయం కాకుండా మరే ఇతర విషయమైనా ఉండొచ్చంటున్నారు. రూ.100 కోట్ల విలువ చేసే బంగళా విషయంలో గొడవ జరుగుతుందంటున్నారు. అయితే ఈ బంగళాను సౌందర్య దగ్గర నుంచి మోహన్ బాబు కొనుగోలు చేశారని కొందరంటారు.. మరికొందరు కబ్జా చేశారంటారు. అసలు విషయం వారికే తెలియాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+