సౌందర్య చనిపోగానే నాన్న అలా చేస్తారని అనుకోలేదు - మంచు విష్ణు
మంచు మోహన్ బాబు వారసుడిగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు మంచు విష్ణు. తనదైన శైలిలో విభిన్న చిత్రాలు చేస్తూ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. గత కొన్నాళ్లుగా ఆయన నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. పలు పాత్రల్లో నటించి మెప్పించిన విష్ణు స్టార్ హీరో రేంజ్ కి మాత్రం ఎదగలేకపోయారు. కానీ ఈసారి మాత్రం పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటాలని ప్లాన్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే భారీ స్థాయిలో "కన్నప్ప" చిత్రంలో నటిస్తూ, నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా రాబోతున్న ఈ మూవీలో రుద్ర అనే పాత్రలో ప్రభాస్ కనిపించనున్నారు. మోహన్ బాబు, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, కాజల్ అగర్వాల్, ఐశ్వర్య రాజేష్, శరత్ కుమార్.. బ్రహ్మానందం, మధుబాల, ముఖేష్ రిషి సహా పలువురు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అవా ఎంటర్‌టైన్‌మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్స్‌పై మంచు మోహన్ బాబు అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. జూన్ 27వ తేదీన ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో.. ప్రమోషన్స్ కార్యక్రమాల్లో స్పీడ్ పెంచారు.

ఈ క్రమంలోనే సినిమాకు సంబంధించిన విషయాలతో పాటు పలు వ్యక్తిగత విషయాలను కూడా పంచుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆమె మరణం తర్వాత నాన్న అలా చేస్తారని అనుకోలేదని షాకింగ్ కామెంట్స్ చేశారు. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.
మంచు విష్ణు ఏమన్నారంటే..
సౌందర్య మరణం గురించి మా నాన్నపై ఎన్నో ఆరోపణలు వినిపించాయని చెప్పుకొచ్చారు. కానీ ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఖండించారు. సౌందర్య మరణ వార్త విన్నప్పుడు తాము షూటింగ్ సెట్లోని ఎడిటింగ్ రూమ్ లో ఉన్నామని.. నాన్నకి ఈ విషయం చెబుతామని నేను ఆయన రూమ్ కి వెళ్లామన్నారు. ఆ తర్వాత డైరెక్టర్ తనకు సైగలు చేసి సౌందర్య మరణించిన విషయాన్ని చెప్పమన్నారని.. ఆ విషయాన్ని నాన్నకి చెప్పిన వెంటనే బాధతో కేకలు వేశారని వాపోయారు. ఆ తర్వాత చాలా బిగ్గరగా అరిచారని.. ఇది నిజం కాదు అనేలా మాట్లాడారని వివరించారు. ఆరోజు నాన్న ప్రవర్తించిన తీరు ఇప్పటికీ గుర్తుందని.. ఆమె మరణం నాన్నను మనోవేదనకి గురి చేసిందని వాపోయారు.
ఇక రీసెంట్ గానే సౌందర్య మరణం గురించి ఖమ్మం జిల్లాకు చెందిన వ్యక్తి పోలీసులను ఆశ్రయించారు. సౌందర్యని చంపింది మోహన్ బాబేనని.. సౌందర్య జల్ పల్లి లోని తన 6 ఎకరాల భూమి అమ్మమంటే.. అమ్మక పోవడంతో కక్ష్య పెంచుకొని.. సౌందర్యని ఆమె సోదరుడిని ఒక పథకం ప్రకారం చంపించాడని ఫిర్యాదు చేశారు. సాక్ష్యాలు కూడా దొరకకుండా చేశారంటూ సంచలన ఫిర్యాదు చేశారు. దాంతో ఈ కేసు వ్యవహారం మీడియాలో సైతం హాట్ టాపిక్ అయ్యింది.
అయితే సౌందర్య భర్త రఘు మాత్రం ఆ కేసు విషయాన్ని కొట్టిపారేశారు. మోహన్ బాబుకు, తమకు మంచి అనుబంధం ఉందని అన్నారు. సౌందర్యది విమాన ప్రమాదమని.. అందులో మోహన్ బాబు ప్రమేయం ఏమీ లేదని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications