Devara Day 2 Collection: రెండో రోజు తగ్గిన దేవర కలెక్షన్లు..!
కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ కాంబినేషన్ లో వచ్చిన దేవర బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. దేవర మొదటి రోజు భారీ వసూల్లు రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా రూ.172 కోట్ల వసూల్ చేసినట్లు చిత్ర యూనిట్ పోస్టర్ రిలీజ్ చేసింది. అయితే రూ.140 నుంచి రూ.150 వచ్చినట్లు సోషల్ మీడియాలో కొందరు పోస్ట్ చేస్తున్నారు. డే వన్ రోజు తెలంగాణ, ఏపీలో కలిసి రూ.68 కోట్లు రాబట్టినట్లు తెలుస్తోంది. ఇక హిందీలో రూ.7 కోట్లు, తమిళం రూ.80 లక్షలు, కన్నడ రూ.30, మళయాలంలో రూ.30 వచ్చాయి.
మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో ఆక్యుపెన్సీ 79 శాతంగా ఉంది. సినిమాపై మిశ్రమ స్పందన రావడంతో దేవర రెండో రోజు కలెక్షన్లు తగ్గినట్లు బిసినెస్ వెబ్ సైట్లు పేర్కొంటున్నాయి. రెండో రోజు రూ. 40 కోట్ల నికర వసూళ్లు వచ్చినట్లు చెబున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో సెకండ్ డే రూ.29.4 కోట్లు వసూలు చేసినట్లు వివరించాయి. రెండో రోజు హిందీ రూ. 9 కోట్లు సాధించింది. తమిళంలో రూ.1కోటి, కన్నడలో రూ.35 లక్షలు, మళయాలంలో రూ.25 లక్షలు రాబట్టింది.

ఈ రెండు రోజులు కలిపి సినిమా మొత్తం రూ.122.5 కోట్లు సాధించినట్లు బిసినెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. దేవరకు హైదరాబాద్ లో అత్యధికంగా 80 శాతం ఆక్యుపెన్సీ ఉంది. నైట్ షోలకు 94 శాతం ఆక్యుపెన్సీ ఉండగా సాయంత్ర 87 శాతం, మధ్యాహ్నం 78 శాతంగా ఉంది. వరంగల్ 71.25 శాతం, కరీంనగర్ లో 70 శాతం, గుంటూరు 72.50 శాతం ఆక్యుపెన్సీ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాపై మొదటి నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. ఫస్ట్ హాఫ్ బాగుందని.. సెకండ్ ఆఫ్ దెబ్బ తీసిందని పలువురు పేర్కొన్నారు.
అయితే చాలా మంది దేవర ఫర్వాలేదని.. యవరేజ్ గా ఉందని అభిప్రాయపడుతున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ దేవర రాడవంతో చాలా హైప్ పెరిగింది. ప్రమోషన్లు కూడా అలానే చేశారు. అయితే చిత్రం అనుకున్న రేంజ్ లో లేదని.. అయినా కలెక్షన్లు రాబడుతుందని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications