మెగా డాటర్ నిహారిక రీ ఎంట్రీ.. సంతోషంతో పోస్ట్!!
మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె మెగా డాటర్ నిహారిక పేరు తెలియని వారు తెలుగు ఇండస్ట్రీలోనూ, తెలుగు రాష్ట్రాలలోనూ లేరు అంటే అతిశయోక్తి కాదు. నిహారికకు పరిచయమే అక్కర్లేదని చెప్పొచ్చు. మెగా ఫ్యామిలీ నుంచి మొదట బుల్లితెరపై యాంకర్ గా తెరంగేట్రం చేసి, ఆ తర్వాత హీరోయిన్ గా సినిమాలలో అవకాశం దక్కించుకుంది నిహారిక కొణిదెల. ఇక సినిమాలలో తనదైన నటనతో గుర్తింపు తెచ్చుకుంది.
నిజ జీవితంలో జొన్నలగడ్డ చైతన్య ను పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమై, ఆపై భర్తతో విభేదాల కారణంగా విడాకులు తీసుకుంది. అప్పటి నుంచి తనకు సంబంధించిన అనేక విషయాలను సోషల్ మీడియా వేదికగా ప్రజలతో పంచుకుంటుంది. నిహారిక సినిమాలలో మాత్రమే కాదు, నిజ జీవితంలో అనేక వివాదాలలోనూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యారు. ఇక తాజాగా మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నట్టు మెగా డాటర్ నిహారిక వెల్లడించింది.

నిహారిక మాత్రమే కాదు నిహారిక నటించబోతున్న సినిమా గురించి మూవీ మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.వాలి మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్న ఎస్సార్ ప్రొడక్షన్ బ్యానర్ పై, బి జగదీశ్ నిర్మిస్తున్న చిత్రంలో నిహారిక కొణిదెల మళ్లీ హీరోయిన్ గా రీ ఎంట్రీ ఇస్తున్నారు. మలయాళం లో ఇటీవల విడుదలై భారీ విజయాన్ని అందుకున్న ఆర్డీఎక్స్ సినిమాలో హీరోగా చేసిన షేన్ నిగమ్ తో నిహారిక జత కట్టబోతున్నారు.
'మద్రాస్ కారన్' అనే సినిమాలో షేన్ నిగమ్ తో హీరోయిన్ గా నిహారిక కొణిదెల ను ఫిక్స్ చేశారు. ఇదే విషయాన్ని సినిమా మేకర్స్ ప్రకటించగా.. నిహారిక కూడా ఈ శుభవార్త చెప్తూ ఇన్ స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ పెట్టారు. ఆ సినిమాకు సంబంధించిన పోస్టర్ రివీల్ చేసిన మెగాస్టార్ నిహారిక కొణిదెల హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్నట్టు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. మరి మళ్ళీ సినిమాలలో అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్న నిహారిక ఈ సినిమాతో ఏం పేరు తెచ్చుకుంటుందో తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications