పవన్ కళ్యాణ్ పొలిటికల్ సీక్రెట్ చెప్పిన నిహారిక కొణిదెల!!

సినీ ఇండస్ట్రీలో పవర్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్న స్టార్ హీరో పవన్ కళ్యాణ్. సినీ ఇండస్ట్రీ లోకి చిరంజీవి తమ్ముడుగా అరంగేట్రం చేసినప్పటికీ తనదైన ప్రత్యేకమైన నటనతో ప్రజలను ఆకట్టుకుని అందరి మనసులో స్థానం దక్కించుకున్నాడు పవన్ కళ్యాణ్.

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
అటు సినిమాలలో మాత్రమే కాకుండా ఇటు రాజకీయాలలోనూ తనదైన పంధాలో పార్టీ పెట్టి ముందుకు వెళ్లిన పవన్ కళ్యాణ్ ఇటీవల ఏపీలో జరిగిన ఎన్నికల్లో అనూహ్య విజయాన్ని చేజిక్కించుకుని డిప్యూటీ సీఎం గా మారాడు . నాలుగు కీలక మంత్రిత్వ శాఖల బాధ్యతలను తీసుకొని పాలనలో తన మార్కు నిర్ణయాలతో పవన్ కళ్యాణ్ ఏపీ ప్రగతి కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం కష్టపడుతున్నాడు.

Mega daughter Niharika Konidela said about pawan kalyan political secret

పవన్ కళ్యాణ్ బాబాయ్ సూపర్ స్టార్
ఇక ఇదే సమయంలో తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన నిహారిక కొణిదెల పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పారు . కమిటీ కుర్రాళ్ళు సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గురించి నిహారిక కొణిదెల చెప్పిన ముచ్చట్లు ప్రస్తుతం ఆసక్తికర చర్చకు కారణంగా మారాయి. బాబాయ్ పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి నిహారిక ఇప్పుడు రాజకీయంగాను బాబాయ్ సూపర్ స్టార్ అంటూ పేర్కొన్నారు.

పవన్ కళ్యాణ్ విజయంతో ఉద్వేగానికి గురైన నిహారిక తల్లి
సినిమా స్టార్ గా కంటే, రాజకీయ నాయకుడుగానే ఆయన్ని తను ఎక్కువ ఇష్టపడతానని చెప్పారు. తన బాబాయ్ విజయం గురించి తెలియగానే మా అమ్మ ఎంతో ఎమోషనల్ అయ్యారని, అమ్మ ఎన్నికల ప్రచారానికి వెళ్లి రాష్ట్రంలో పరిస్థితులు చూసింది కాబట్టి అక్కడ పవన్ కళ్యాణ్ బాబాయ్ విజయాన్ని ఎక్కువగా కోరుకున్నారని నిహారిక తెలిపారు. అనుకున్నది జరగడంతో చాలా ఉద్వేగానికి తన తల్లి గురైందని నిహారిక స్పష్టం చేశారు.

పవన్ బాబాయి ప్రసంగాలు బాగుంటాయి
ఫలితాల రోజు టీవీ ముందు కూర్చున్న మేమంతా ఫలితాలు వస్తున్నప్పుడు కలిగిన ఆనందాన్ని మాటల్లో చెప్పలేమని నిహారిక కొణిదెల పేర్కొన్నారు. తమ బాబాయి ఉపముఖ్యమంత్రి అయ్యారని గర్వపడడం కంటే, ఆయన కష్టానికి తగిన ఫలితం దక్కిందని తాము ఎంతో సంతోషించామన్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రసంగాలు చాలా మోటివేటివ్ గా ఉంటాయన్నారు. ఆయన స్పీచ్ ఇచ్చే సమయంలో అక్కడ ఉంటే బాగుండని ఎన్నోసార్లు అనుకున్నానని నిహారిక పేర్కొన్నారు. ఆయన విజయానికి ఆయన స్పీచ్ లు కారణం అన్నారు.

నిహారిక ఫోన్ లో పవన్ కళ్యాణ్ పేరు అలా
బాబాయ్ తనను ఎప్పుడు నిహా అని పిలుస్తారని తనపై ఎప్పుడూ ఆయనకు కోపం రాలేదని చెప్పిన నిహారిక కొణిదల తన ఫోన్లో ఆయన పేరు కేకేకే అని ఉంటుందని తెలిపారు పవన్ కళ్యాణ్ అసలు పేరు కళ్యాణ్ కుమార్ అని తెలిసిన తర్వాత కొణిదల కళ్యాణ్ కుమార్ కేకేకే అని సేవ్ చేసుకున్నానని నిహారిక స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+