ఆ ట్యాగ్ వాడొద్దు: అల్లు అర్జున్‌కు చిరంజీవి స్ట్రాంగ్ వార్నింగ్?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం పుష్ప2. పాన్ ఇండియాలో స్థాయిలో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అల్లు అర్జున్ కు, దర్శకుడు సుకుమార్ కు, మైత్రీమూవీ మేకర్స్ కు ఈ సినిమా అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. దాదాపు రూ.వెయ్యి కోట్ల బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. సినిమా బడ్జెట్ రూ.400 కోట్ల వరకు అయింది. అయితే కొన్నాళ్ల నుంచి అల్లు అర్జున్ కు, మెగా కుటుంబానికి మధ్య ఉప్పు నిప్పులా ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా వరుణ్ తేజ్ కూడా పరోక్షంగా బన్నీని గురించి కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం ఇవి వైరలవుతున్నాయి.
ఎక్కడి నుంచి వచ్చామో మర్చిపోవద్దు
మనం ఎక్కడి నుంచి వచ్చామనేది మర్చిపోవద్దని, మన వెనకాల ఎవరున్నారనేది మర్చిపోవద్దని, అలా మర్చిపోతే ఆ విజయం ఎందుకు పనికిరాదని వరుణ్ తేజ్ వ్యాఖ్యానించాడు. మట్కా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ వ్యాఖ్యలను వరుణ్ తేజ్ చేశాడు. ఇవి కచ్చితంగా అల్లు అర్జున్ గురించే అని సోషల్ మీడియాలో వార్త వైరల్ గా మారింది. తాజాగా మరో వార్త సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఇప్పటివరకు అల్లు అర్జున్ అన్ని సినిమాలకు మెగా అభిమానులు మద్దతుగా నిలబడ్డారు. సినిమా విజయం సాధించిందంటే అందులో అధిక శాతం భాగం వారికే చెందుతుంది.

మెగా ట్యాగ్ వాడొద్దు
పవన్ కల్యాణ్ గురించి వ్యాఖ్యలు చేసినప్పుడు మాత్రం నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమాను చూడలేదు. ఆ సినిమా ఫ్లాప్ అయింది. ప్రస్తుతం కూడా పవన్ కల్యాణ్ అభిమానులకు, బన్నీ అభిమానుల మధ్య సోషల్ మీడియాలో పెద్ద యుద్ధమే జరుగుతోంది. అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం మెగా ట్యాగ్ ను అల్లు అర్జున్ వాడుకోవద్దని మెగాస్టార్ చిరంజీవి గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఎటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయకుండా మౌనంగా ఉన్న చిరంజీవి తన సన్నిహితులతో, కుటుంబ సభ్యులతో, అభిమాన సంఘాల నాయకులతో ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ మెగా ట్యాగ్ అనేది వాడుకోకుండా, మెగా అభిమానుల అవసరం లేకుండానే తనకున్న సొంత అభిమాన బలంతోనే విజయం సాధిస్తే బాగుంటుందని వ్యాఖ్యానించినట్లు సోషల్ మీడియాలో వార్త హల్ చల్ చేస్తోంది. దీంతో మెగా అభిమానులంతా పుష్ప2 సినిమాకు దూరం కావాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications