మెగా ఫ్యామిలీలోకి కోడలిగా ఎంట్రీ ఇవ్వనున్న యంగ్ హీరోయిన్..??

మెగా ఫ్యామిలీకి తెలుగు ఇండస్ట్రీలో చాలా క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. గ్లోబర్ స్టార్ రామ్ చరణ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లు పాన్ ఇండియా రేంజ్ లో సత్తా చాటారు. మెగా బ్రదర్స్ ఎంత అన్యోన్యంగా ఉంటారో మనందరికీ తెలిసిందే. వారిని చూస్తే ప్రతి కుటుంబంలోనూ అన్నాదమ్ముళ్లు అంటే అలా ఉండాలని అనుకుంటారు. అంత ప్రేమగా ఉంటారు. అయితే మెగా ఫ్యామిలీలోకి త్వరలోనే ఓ యంగ్ హీరోయిన్ కోడలిగా అడుగు పెట్టనున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. మరి ఆమె ఎవరు..?

ఇండస్ట్రీకు చెందిన ఒక స్టార్ కిడ్.. యంగ్ హీరోయిన్ గా గత కొద్ది రోజులుగా ప్రేమాయణం నడుపుతున్నాడని టాక్ వినిపిస్తోంది. త్వరలోనే వీళ్లిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారన్న వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అయితే వీళ్లిద్దరు కూడా ప్రస్తుతం కెరీర్ లో సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్నారని ఒక హింట్ కూడా ఇచ్చారు ఇండస్ట్రీ లోని కొందరు జర్నలిస్టులు.. మరి ఆ స్టార్ కిడ్ ఎవరు..? ఆ యంగ్ బ్యూటీ ఎవరు..?

ఇండస్ట్రీలో స్టార్ కిడ్స్ పెళ్లిళ్లు దాదాపుగా అందరివీ ఐపోయాయి. ఇక మిగిలింది అక్కినేని ఫ్యామిలీ నుండి సుశాంత్, అలాగే మెగా ఫ్యామిలీ నుండి సాయి ధరమ్ తేజ్ , పంజా వైష్ణవ్ తేజ్.. ఇక చాలా కాలంగా సుశాంత్, మీనాక్షి చౌదరి ప్రేమలో ఉన్నారని రూమర్స్ వినిపించాయి. కానీ పైన చెప్పిన దాని ప్రకారం చూస్తే.. మీనాక్షి చౌదరి ఇటీవల సంక్రాంతికి అనగనగ ఒక రాజు చిత్రంతో భారీ బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఇక మిగిలింది సాయి ధరమ్ తేజ్, పంజా వైష్ణవ్ తేజ్..

MegaFamily Daughter-in-Law Which Young Actress Is All Set to Join the Clan Mega Family wedding

అయితే పైన చెప్పిన వివరాల ప్రకారం సాయి ధరమ్ తేజ్ ఫెయిల్యూర్స్ లో లేడు. రానున్న సంబరాల ఏటి గట్టు సినిమాతో ఆయన బ్లాక్ బస్టర్ అందుకోబోతున్నాడు. కాబట్టి ఆ మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ అని తెలుస్తోంది. వైష్ణవ్ తేజ్ ప్రస్తుతం వరుస ఫ్లాప్స్ లో ఉన్నాడు. ఉప్పెన హీరోయిన్ కృతి శెట్టి కూడా వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ లోనే ఉంది. ఇద్దరూ హిట్ కోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు కాబట్టి.. ఆ జంట వీళ్లిద్దరే అని ఫిలిం నగర్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇక వీళ్లిద్దరి మధ్య స్నేహం ఉప్పెన సినిమా నుండి మొదలైంది. ఆ మూవీ బ్లాక్ బస్టర్ అయింది. అలాగే వీళ్లిద్దరికీ మంచి పేరు తీసుకొచ్చింది. కాబట్టి కృతి శెట్టి మెగా ఫ్యామిలీ లోకి కోడలిగా ఎంట్రీ ఇవ్వబోతుందని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+