బుచ్చిబాబు- చిరంజీవి సినిమా.. మైత్రి నిర్మాణంలో..?

టాలీవుడ్ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా అనగానే 'ఉప్పెన', 'పెద్ది' సినిమాలే గుర్తుకొస్తాయి. ఈ రెండు సినిమాలూ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసినవే. 2021 లో వచ్చిన ఉప్పెనలో మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ ప్రధాన పాత్రలో, కృషి శెట్టి హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ బడ్జెట్ రూ. 22 కోట్లు కాగా బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. కరోనా సమయంలోనూ యువతను థియేటర్లకు రప్పించింది ఈ మూవీ.

దేవిశ్రీప్రసాద్ పాటలు ఈ మూవీలో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఈ మూవీ పాటలు ఇప్పటికీ ట్రెండ్ అవుతుంటాయి. ఇక ఆ తర్వాత నాలుగేళ్లు గ్యాప్ తీసుకుని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో 'పెద్ది' సినిమా తీశారు. గేమ్ ఛేంజర్ లాంటి డిజాస్టర్ తర్వాత రామ్ చరణ్ కమ్ బ్యాక్ సినిమాగా పెద్ది నిలిచింది. ఈ మూవీ 2026 లో తెలుగులో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా నిలిచింది. ఈ చిత్రానికి ఏఆర్ రహమాన్ సంగీతం అందించారు. ఈ సినిమాలోని చికిరి చికిరి సాంగ్ ఎంత పాపులర్ అయిందో తెలిసిందే.

Megastar Chiranjeevi Movie directed by Tollywood director Buchibabu Mythri Movie Makers production

అయితే పెద్ది చిత్రం తర్వాత బుచ్చిబాబు సానా తీస్తున్న సినిమాపై ఇప్పటివరకూ ఎలాంటి క్లూ రాలేదు. ఈ క్రమంలో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ఓ వార్త వైరల్ అవుతోంది. బుచ్చి బాబు.. మెగాస్టార్ చిరంజీవితో తన తదుపరి చిత్రాన్ని తీస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇప్పటివరకూ అధికారిక ప్రకటన రాలేదు. ఈ చిత్రాన్ని టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ తెరకెక్కించనున్నట్లు స్పష్టం అవుతోంది. ముచ్చటగా మూడోసారీ బుచ్చిబాబు మెగా కాంపౌండ్ లోనే సినిమాలు చేస్తున్నట్లు పలువురు నెటిజన్లు సామాజిక మాధ్యమాల్లో కామెంట్స్ పెడుతున్నారు. ఇక ఈ క్రేజీ ప్రాజెక్ట్ కు సంబంధించిన వివరాలు త్వరలోనే వెల్లడికానున్నట్లు తెలుస్తోంది. ఈ అప్డేట్ పై నెటిజన్లు పలు రకాలుగా కామెంట్స్ పెడుతున్నారు. ఈసారి ఏం కట్ చేస్తాడో అని ఓ యూజర్ కామెంట్ పెట్టాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+