ఆ లేడి డైరెక్టర్‌తో మెగాస్టార్ రెండు గంటలు మీటింగ్.. రీజన్ ఏంటంటే ?

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. ముగింపు దశకు చేరుకున్న ఈ మూవీ 2025 సమ్మర్‌లో విడుదల కానుంది. ఆ తర్వాత అనిల్‌ రావిపూడి సినిమానే ప్రారంభం అవుతుందని సమాచారం. ఇప్పటికే అనిల్ రావిపూడి సైతం స్క్రిప్ట్ సిద్ధం చేసే పనిలో ఉన్నారట. ఆ స్క్రిప్ట్ ఫైనల్ అయిన తర్వాత మే, జూన్ నెలలో నుంచి సినిమా పట్టాలెక్కించి వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నట్టు ఆ సినిమా నిర్మాత సాహు గారపాటి పేర్కొన్నారు.

అలానే శ్రీకాంత్ ఓదెలతో కూడా ఒక సినిమాకు కమిట్ అయ్యారు మెగాస్టార్. ఇంతటి బిజీ షెడ్యూల్ లో ఉండి కూడా చిరు ఓ లేడి డైరెక్టర్ కి రెండు గంటలు సమయం కేటాయించి.. కలవడం, మాట్లాడడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. దీంతో ఇంతకీ ఆ లేడి దర్శకురాలు ఎవరు ? బాస్ ఏం మాట్లాడారు ? నెక్స్ట్ మూవీ ఆమెతో చేయబోతున్నారా అని హాట్ టాపిక్ గా డిస్కషన్ నడుస్తోంది.

Megastar meeting with that lady director for two hours What is the reason

ఈ క్రమంలోనే ఆ లేడీ డైరెక్టర్ స్వాతినిగా తెలుస్తోంది. ఆమె గతంలో నిహారికతో ఓ సినిమా చేసింది. నిహారిక పెళ్లి కంటే ముందుగానే ఈ ప్రాజెక్ట్ చేయాల్సింది. అప్పుడు అనుకోని కారణాల వల్ల ఆగిపోయింది. రీసెంట్‌ గానే స్వాతిని ఆ మూవీని పూర్తి చేసింది. నిహారికతో స్వాతినికి మంచి రిలేషన్ ఉంది. ఇక ఈ రిలేషన్‌తోనే ఇలా మెగాస్టార్ చిరంజీవి వద్దకు వచ్చేసింది లేడి డైరెక్టర్. ఈ క్రమంలోనే తన ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ.. చిరంజీవితో రెండు గంటలు ముచ్చట్లు పెట్టాను అంటే అసలు ఇది నిజమా? కలనా? అంటూ రాసుకోచ్చింది.

నన్ను గిచ్చి చూడండి..అసలు ఇది కలా? నిజమా? అన్నట్టుగా ఉందని ఎమోషనల్ అయ్యింది. నా జీవితంలో ఈ రెండు గంటల్ని ఎప్పటికీ మర్చిపోలేను పొస్త చేసింది. అంతే కాకుండా నిహారిక, నాగబాబుకు ప్రత్యేకంగా థాంక్స్ చెప్పింది స్వాతిని. ఆమె పోస్ట్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+