ఆ సీనియర్ నటుడితో పెళ్లి: మృణాల్ ఠాకూర్ ఫైర్!
బాలీవుడ్, టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నస్టార్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ప్రస్తుతం తీవ్ర అసహనంతో ఉన్నారు.ఇటీవల ఆమె నటించిన 'డెకాయిట్: ఎ లవ్ స్టోరీ' చిత్ర ప్రమోషన్లలో భాగంగా మాట్లాడుతూ.. గతేడాది విడుదలైన 'సన్ ఆఫ్ సర్దార్ 2' సినిమా మేకర్స్‌పై సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఆ సినిమాలో తన పాత్రను తీర్చిదిద్దిన విధానం, షూటింగ్ చేసిన కొన్ని కీలక సన్నివేశాలను ఎడిటింగ్‌లో తొలగించడంపై మృణాల్ ఠాకూర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
మొగుడిగా సీనియర్ నటుడు
ముఖ్యంగా సినిమాలో తన భర్త పాత్ర కోసం ఓ సీనియర్ నటుడిని ఎంపిక చేయడంపై మృణాల్ ఠాకూర్ అసహనం వ్యక్తం చేశారు. "నా కంటే వయసులో చాలా పెద్దవారైన ఒక సీనియర్ నటుడిని నా భర్తగా చూపిస్తారని నాకు ముందుగా తెలియదు. ఆ కాస్టింగ్ నిర్ణయం విన్నప్పుడు నా నమ్మకం కాస్త దెబ్బతిన్న మాట వాస్తవమే. నా క్యారెక్టర్ విషయంలో నేను ఓ రకమైన అంచనాతో ఉన్నాను, కానీ అక్కడ జరిగింది వేరు. దీంతో నేను కొంత నిరాశకు గురయ్యాను" అని మృణాల్ ఠాకూర్ పేర్కొన్నారు. 'సన్ ఆఫ్ సర్దార్ 2'లో మృణాల్‌కు భర్తగా చంకీ పాండే నటించగా.. వీరిద్దరి మధ్య దాదాపు 30 ఏళ్ల వయసు తేడా ఉంది.

ఎమోషనల్ సీన్లు మాయం!
అంతేకాకుండా సినిమాలో ఎంతో ఇష్టపడి చేసిన కొన్ని ఎమోషనల్ సీన్లను ఎడిటింగ్ టేబుల్ మీద కట్ చేయడం ఆమెను మరింత బాధించింది. తన సోదరి కూతురుగా నటించిన రోష్ని వాలియాతో ఉన్న ఓ హృదయ విదారకమైన సన్నివేశం గురించి మృణాల్ ఠాకూర్ వివరించారు. "ఆ సీన్ కథలో చాలా కీలకం. నా వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసి ఆ అమ్మాయిని పెంచుతాను. 'నువ్వు నాకు జన్మనివ్వకపోయినా.. ప్రతి అమ్మాయికి నీలాంటి తల్లి దొరకాలని కోరుకుంటున్నా' అని ఆ పాప చెప్పే డైలాగ్ ఎంతో ఎమోషనల్‌గా ఉంటుంది. కానీ ఎడిటర్లు ఆ భాగాన్ని పూర్తిగా తొలగించారని మృణాల్ ఠాకూర్ ఆవేదన వ్యక్తం చేశారు.
అయితే ఈ చేదు అనుభవాల పట్ల తనకు ఎలాంటి విచారం లేదని.. సినిమా బృందంతో తన సంబంధాలు ఇప్పటికీ బాగున్నాయని మృణాల్ ఠాకూర్ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆమె నటించిన 'డెకాయిట్' బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించకపోయినా.. ఆమె చేతిలో 'రాకా' (అల్లు అర్జున్ - అట్లీ సినిమా) సహా మరో మూడు పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయి. టీవీ సీరియల్స్‌తో కెరీర్ మొదలుపెట్టి 'సీతా రామం', 'హాయ్ నాన్న' వంటి చిత్రాలతో దక్షిణాదిలో స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న మృణాల్, వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్నారు.












Click it and Unblock the Notifications