గంటల తరబడి కూర్చొని పని చేస్తున్నారా - ఈ లక్షణాలు కనిపిస్తే, ముప్పు తప్పదు..!!
చాలా మంది గంటల తరబడి కూర్చొని చేసే పనికి అలవాటు పడ్డారు. ఆఫీసు పనులైనా, ఆన్‌లైన్ చదువులైనా గంటల తరబడి కంప్యూటర్లు, ల్యాప్ టాప్‌ల ముందు కూర్చోవడం కామన్ గా మారిపోయింది. అయితే, కదలకుండా ఒకే చోట ఎక్కువ సేపు కూర్చోవడం అనేది 'సైలెంట్ కిల్లర్'లా మారుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలా కూర్చోవడం వల్ల శరీరానికి హాని కలుగుతుంది. నిపుణుల ప్రకారం, ఎక్కువసేపు కూర్చోవడం వల్ల కండరాలు బలహీనపడ తాయి, వెన్నెముకపై ఒత్తిడి పెరుగుతుంది. దీని వల్ల నడుము నొప్పి, రక్త ప్రసరణ సరిగా జరగక చేతులు, కాళ్లలో వాపు కూడా రావచ్చు. అయితే, కొన్ని లక్షణాలు కనిపిస్తే మాత్రం అలర్ట్ కావాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఎక్కువ సేపు కూర్చోవడం కారణంగా శరీర కదలిక లేకపోవడం వల్ల కండరాలు పటుత్వాన్ని కోల్పోతాయి. ముఖ్యంగా వెన్నెముకపై ఒత్తిడి పెరిగి తీవ్రమైన వెన్ను, నడుము నొప్పులకు దారితీస్తుంది. కాళ్లు, చేతుల్లో రక్త ప్రవాహం మందగించి తిమ్మిర్లు రావడం లేదా వాపులు రావడం జరుగుతుంది. కేలరీలు సరిగ్గా బర్న్ అవ్వవు, దీనివల్ల ఊబకాయం, మధుమేహం, గుండె జబ్బుల ముప్పు పెరుగుతుంది. స్క్రీన్ల వైపు నిరంతరం చూడటం వల్ల చూపు మందగించడం, మానసిక ఒత్తిడికి, చిరాకుకు కూడా కారణమవుతుంది. ఇంకా ఈ అలవాటు వల్ల బరువు పెరగడం, గుండె సమస్యలు, మధుమేహం వంటి వ్యాధుల ప్రమాదం కూడా పెరుగుతుంది. జీవక్రియ మందగించడం వల్ల కేలరీలు సరిగ్గా ఖర్చు కావు. అలాగే ఎప్పుడూ స్క్రీన్‌ను చూస్తూ ఉండడం వల్ల కళ్లపై ఒత్తిడి పెరిగి చూపు సమస్యలు రావచ్చు. ఇది మానసిక ఆరోగ్యంపైనా ప్రభావం చూపి అలసట, చంచలత్వం, పనిపై దృష్టి తగ్గడం వంటి సమస్యలు కలిగిస్తుంది.

నిపుణుల సూచనలు
అయితే, ఇలా కూర్చొని పని చేసే వారిలో కొన్ని లక్షణాలు కనిపిస్తే మాత్రం నిర్లక్ష్యం చేయవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందులో ప్రధానంగా వెన్ను నొప్పి, కళ్లు మండటం, అలసట, చేతులు, కాళ్లలో వాపు లేదా నొప్పి, శక్తి లేకపోవడం, నిద్ర సరిగా రాకపోవడం, బరువు పెరగడం, కండరాల బలహీనత వంటి ఉన్నాయి. ఇదే సమయంలో ఎక్కవగా కూర్చొని పని చేసే వారికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచిస్తున్నారు. కనీసం ప్రతి గంటకు ఒకసారి లేచి విరామం తీసుకోవాలి. అదే విధంగా కొద్దిసేపు నడవాలి లేదా స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయాలి. కంప్యూటర్ ను కంటి స్థాయికి సమానంగా ఉండేలా చూసుకుని, సరైన భంగిమలో కూర్చోవాలి. సమతుల్య ఆహారం తీసుకుని, ఎక్కువగా నీరు తాగాలి. యోగా లేదా వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవటంతో పాటుగా.. చిన్న పాటి శారీరక కదలికలతో మార్పులు చేసుకుంటే నష్టం నుంచి బయట పడవచ్చని సూచిస్తున్నారు.













Click it and Unblock the Notifications