ఉదయ్ కిరణ్ సినిమాలను హ్యాండిల్ చేసింది మెగా ఫ్యామిలీనే.. సంచలన విషయాలు బయటపెట్టిన బడా నిర్మాత

దివంగత హీరో ఉదయ్ కిరణ్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదు. 'చిత్రం', 'నువ్వు నేను', 'మనసంతా నువ్వే' వంటి వరుస హిట్ చిత్రాలతో యాట్రిక్ హీరోగా గుర్తింపు పొందారు. లవర్ బాయ్ ఇమేజ్‌తో యువతలో, కుటుంబ ప్రేక్షకులలో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. అయితే, ఆ తర్వాత అతని కెరీర్‌లో కొన్ని ఒడిదుడుకులు ఎదురయ్యాయి. సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడకపోవడం, సరైన అవకాశాలు లేకపోవడం వంటి కారణాలతో ఆయన డిప్రెషన్‌లోకి వెళ్లినట్లు వార్తలు వచ్చాయి. మానసిక క్షోభే అతని ఆత్మహత్యకు ప్రధాన కారణమని భావించారు. అతని మరణంపై పలు అనుమానాలు, చర్చలు కూడా జరిగాయి, అయితే పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపారు.అలా ఉదయ్ కిరణ్ మరణం సినీ పరిశ్రమకు ఒక తీరని లోటుగా మిగిలిపోయింది.

అయితే ఉదయ్ కిరణ్ వరుస విజయాలతో దూసుకుపోతున్న సమయంలో, మెగా ఫ్యామిలీ ఆయన్ని తమ ఇంటి అల్లుడిగా చేసుకోవాలని భావించింది. మెగాస్టార్ చిరంజీవి తన పెద్ద కూతురు సుస్మితను ఉదయ్ కిరణ్‌కు ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నారు. ఏం జరిగిందో తెలియదు కానీ, ఈ వివాహం ఆగిపోయింది. అల్లుడు కాబోతున్నాడనే కారణంతో, మెగా ఫ్యామిలీ ఉదయ్ కిరణ్ కెరీర్‌ను తామే పర్యవేక్షించాలని నిర్ణయించుకుందట. అతని డైరీని కూడా తీసుకుని, ఏ సినిమాలు చేయాలి, ఏ సినిమాలు చేయకూడదు అని అల్లు అరవింద్ నిర్ణయించారట. ఈ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో నటుడు,జయభేరి అధినేత మురళి మోహన్ బయటపెట్టారు.

Murali Mohan reveals key facts about Uday Kiran

ఈ ప్రస్తావనకు ముందే ఉదయ్ కిరణ్ 'అతడు' సినిమాను ఒప్పుకున్నారని, అయితే అల్లు అరవింద్ ఈ సినిమాను చేయవద్దని చెప్పడంతో ఉదయ్ ఆ అవకాశాన్ని కోల్పోయాడని మురళి మోహన్ తెలిపారు. ఆ తర్వాత 'అతడు' సినిమా మహేష్ బాబు చేసి బ్లాక్‌బస్టర్ హిట్ కావడంతో, ఉదయ్ కిరణ్ ఒక పెద్ద అవకాశాన్ని కోల్పోయాడు. ఇలా ఎన్నో మంచి సినిమాలను కోల్పోయిన ఉదయ్ కిరణ్, అనుకోని కారణాల వల్ల మెగా ఫ్యామిలీకి అల్లుడు కాలేకపోయాడు.ఈ పరిణామాలన్నీ ఉదయ్ కిరణ్ కెరీర్‌పై తీవ్ర ప్రభావం చూపాయని, అవకాశాలు తగ్గిపోవడం, చేతిలో సినిమాలు లేకపోవడంతో ఆయన తీవ్ర మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి చేరుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+