విజయ్‌కు బిగ్ షాక్..సంచలన ప్రకటన చేసిన త్రిష
హీరోయిన్ త్రిష క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 20 ఏళ్లుగా హీరోయిన్‌గా నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో త్రిష నటించింది. ముఖ్యంగా తెలుగులో టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. మహేష్ బాబు, ప్రభాస్, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి టాప్ హీరోల సరసన నటించి తన పాపులారిటీని మరింత పెంచుకుంది. యంగ్ హీరోయిన్స్ ఎంట్రీ ఇవ్వడంతో త్రిష హవా తగ్గిపోయింది.
అయితే త్రిష ఇటీవలే మళ్లీ వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా మారింది. పొన్నియర్ సెల్వం రెండు పార్ట్‌ల్లో అలరించిన త్రిష, తమిళ స్టార్ హీరో విజయ్ , లోకేష్ కనకరాజ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన లియో సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ప్రస్తుతం చిరంజీవి సరసన విశ్వంభర సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. సూర్య కొత్త సినిమాలో కూడా త్రిషనే హీరోయిన్‌గా తీసుకున్నారు. 41 ఏళ్ల వచ్చినప్పటికీ తన అందంతో ప్రేక్షకులను మంత్రముగ్దులను చేస్తోంది. ఇదిలా ఉంటే త్రిష సంచలన ప్రకటన చేశారు.

సామాజిక సమస్యలపై పోరాడుతూ, ప్రజా సేవ చెయ్యాలన్నది తన ఆలోచన అని ఈ ఇంటర్వ్యూలో వెల్లడించింది త్రిష. ఇలా చేయాలంటే కేవలం రాజకీయాల వల్లే సాధ్యమని ఆమె అభిప్రాయపడింది. తనకు రాజకీయాల్లోకి వెళ్లాలనే ఆసక్తి చాలా ఉందన్న త్రిష.. ఏదో ఒకరోజు తమిళనాడుకి ముఖ్యమంత్రి కావాలనేది తన కోరిక అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
ఇదే సమయంలో తమిళ స్టార్ హీరోతో విజయ్‌తో త్రిష రిలేషన్‌లో ఉన్నారంటూ గత కొద్దికాలంగా ప్రచారం జరుగుతోంది. వీరిద్దరు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ కోలీవుడ్ మీడియాలో అనేక కథనాలు వెలువడుతున్నాయి. తమిళ వెట్రి కజగం అనే పేరిట విజయ్ తమిళనాడులో తన రాజకీయ పార్టీని స్థాపించారు. ఆయన వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి రెడీ అవుతున్నారు. ఇటువంటి తరుణంలో త్రిష తాను కూడా సీఎం అవుతానని చెప్పడం విజయ్‌కు కాస్తా ఇబ్బందిగా మారే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications