ఫస్ట్ టైమ్ కలిసి వచ్చిన నాగ చైతన్య, శోభిత... ఎందుకంటే ?
అక్కినేని ఫ్యామిలీ, అక్కినేని అభిమానులు అంతా ప్రజెంట్ ఫుల్ జోష్ లో ఉన్నారు. అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి కలిసి నటించిన 'తండేల్' చిత్రం భారీ హిట్ అందుకుంది. గత కొన్నేళ్లుగా వరుస సినిమాలతో ప్రేక్షకులను నిరాశపరిచిన చైతూ ఈసారి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. దీంతో పెళ్లి తర్వాత నాగ చైతన్య లైఫ్ మళ్లీ ఫామ్ లోకి వచ్చిందని అభిప్రాయపడుతున్నారు.
ఈ క్రమంలోనే హైదరాబాద్‌లోని ట్రిడెంట్ హోటల్ లో.. తండేల్ బ్లాక్ బస్టర్ లవ్ సునామీ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు, అక్కినేని నాగార్జున ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు. అయితే ఈ ఈవెంట్‌కి నాగ చైతన్య, శోభిత పెళ్లి తర్వాత మొదటిసారి కలిసి రావడం హాట్ టాపిక్ గా మారింది. ఈ ఆనందంతో అభిమానుల్లో ఉత్సాహం డబుల్ అయ్యిందని కామెంట్స్ చేస్తున్నారు.

ఇక చందూ మొండేటి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఫిబ్రవరి 7న విడుదలై.. ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ అందుకుంటోంది. ముఖ్యంగా నాగ చైతన్య నటన అదిరిపోయిందని ప్రేక్షకులు చెబుతున్నారు. దేశభక్తి ఎలిమెంట్స్‌తో అందమైన ప్రేమకథను చూపించారని అంటున్నారు. సాయి పల్లవి, నాగ చైతన్య ఇద్దరూ పోటీపడి మరీ నటించారని అంటున్నారు. సినిమా అంతా ఒక ఎత్తు అయితే, చివరి 20 నిమిషాల సినిమాను దర్శకుడు మరో లెవెల్‌కు తీసుకువెళ్లారని చెబుతున్నారు. క్లైమాక్స్‌లో నాగ చైతన్య నటన అందర్నీ కత్తిపడేసిందని కితాబు ఇస్తున్నారు.
దేవి శ్రీ ప్రసాద్ ఇచ్చిన సంగీతం నెక్స్ట్ లెవెల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు ఈ సినిమా కలెక్షన్స్ వర్షం కురిపిస్తోంది. శుక్రవారం సినిమా రిలీజ్ అవ్వగా.. వీకెండ్ తో పాటు.. సోమవారం కూడా కలెక్షన్స్ జోరు కొనసాగించాయి. ఈ సినిమా ఇప్పటివరకు నాలుగు రోజుల్లో 73 కోట్ల 20 లక్షలకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసినట్లు మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇక చైతూ సినిమా 100 కోట్ల క్లబ్ లోకి రావడం ఖాయం అంటూ అక్కినేని ఫ్యాన్స్ మురిసిపోతున్నారు.












Click it and Unblock the Notifications