సమంత విషయంలో చేసింది.. శోభిత విషయంలో చేయను: నాగచైతన్య

టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య గత నెల ఎనిమిదో తేదీన శోభిత ధూళిపాళతో నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. నాగార్జున నివాసంలో జరిగిన ఈ వేడుక చాలా సింపుల్ గా కుటుంబ సభ్యుల మధ్య జరిపించారు. వచ్చే ఏడాది మార్చిలో వివాహం జరగబోతోంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో లేదంటే పారిస్ లో వివాహం జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇంతకుముందు హీరోయిన్ సమంతను నాగచైతన్య ప్రేమించి పెళ్లిచేసుకున్న సంగతి తెలిసిందే. ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో 2017లో వీరిద్దరూ విడిపోయారు.

వీరిద్దరూ ఒక్క సినిమా కూడా చేయలేదు
అప్పటి నుంచి సమంత ఒంటరిగానే జీవిస్తోంది. మధ్యలో మయోసైటిస్ వ్యాధికి గురైతే సినిమాలకు తాత్కాలిక విరామం ప్రకటించి చికిత్స తీసుకుంది. నాగచైతన్య మాత్రం రెండు సంవత్సరాల నుంచి శోభితతో ప్రేమలో ఉండి తాజాగా నిశ్చితార్థం జరుపుకున్నాడు. ఇంతవరకు నాగచైతన్య శోభితతో కలిసి ఒక్క సినిమా కూడా చేయలేదు. వీరిద్దరూ కలిసి సినిమా చేస్తారా? అనే వార్త సామాజిక మాధ్యమాల్లో హాట్ టాపిక్ గా మారింది.

Naga Chaitanya says that he has no intention of doing a film with Shobhita dhulipala

అటువంటి ప్రణాళికలేమీ లేవు
నాగచైతన్య, సమంత ఏమాయ చేశావే సినిమాలో తొలిసారిగా కలిసి నటించారు. అప్పటి నుంచి వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఈ సినిమా తర్వాత మనం, మజిలీ, ఆటోనగర్ సూర్య సినిమాలు చేశారు. వీరిద్దరి మధ్య ఉన్న పరిచయం ప్రేమగా మారి పెళ్లివరకు వెళ్లింది. ప్రస్తుతం శోభితతో ఒక్క సినిమా కూడా చేయలేదు కాబట్టి ఏదైనా సినిమా చేస్తున్నారా? అని ఓ కార్యక్రమంలో విలేకరులు అడిగారు. అయితే అటువంటి ప్రణాళికలు ఏవీ లేవని స్పష్టంగా చెప్పేశాడు. దీన్నిబట్టి భవిష్యత్తులో కూడా శోభితతో కలిసి సినిమా చేసే ఉద్దేశంలో లేడని అర్థమవుతోంది. సమంతతో కలిసి సినిమాలు చేసిన తర్వాతే విడిపోయామనే సెంటిమెంట్ నాగచైతన్యకు ఉండివుండొచ్చని, అందుకే ఈ నిర్ణయం తీసుకొనివుంటాడని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+