అల్లు అర్జున్‌తో నాగబాబుకు వివాదం

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో మెగా సోదరుడు నాగబాబుకు వివాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సమయంలో బన్నీ నంద్యాల నుంచి పోటీచేస్తున్న తన స్నేహితుడు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి దగ్గరకు స్వయంగా వెళ్లి మద్దతు తెలిపాడు. అదే సమయంలో పిఠాపురం నుంచి పోటీచేస్తున్న తన చిన మామయ్య పవన్ కల్యాణ్ కు మాత్రం ట్వీట్ ద్వారా మద్దతు తెలిపి సరిపెట్టాడు. తాను సాధించాలనుకుంటున్న లక్ష్యాన్ని పవన్ చేరుకోవాలంటూ ఆ ట్వీట్ లో కోరాడు.

మనవాడైనా పరాయివాడే
దీనిపై మెగా సోదరుడు నాగబాబు రెండు రోజుల సమయం తర్వాత స్పందించారు. మనవాడు పరాయివాడితో ఉంటే పరాయివాడే అవుతాడని, పరాయివాడైనప్పటికీ మనతో ఉంటే మనవాడే అవుతాడని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ పెద్ద సంచలనం కలిగించింది. అల్లు అర్జున్ ను ఉద్దేశించే ఈ ట్వీట్ చేశాడనే విషయం రెండు తెలుగు రాష్ట్రాల్లో అందరికీ అర్థమైంది. పవన్ విజయం సాధించిన తర్వాత కూడా బన్నీ ఓ ట్వీట్ తో సరిపెట్టాడు. తాజాగా తాడిపత్రి నుంచి విజయం సాధించిన జేసీ అస్మిత్ రెడ్డితో కలిసి అల్లు అర్జున్, అతని భార్య స్నేహారెడ్డి డ్యాన్స్ వేసిన వీడియో వైరలైంది.

nagababu daughter niharika konidela comments on allu arjun and nagababu issue

వేరేవారి అభిప్రాయం నాకు తెలియదు
మెగా కుటుంబానికి, బన్నీకి ఇలా వివాదం కొనసాగుతోంది. తాజాగా నాగబాబు కుమార్తె నీహారిక తాను నిర్మిస్తున్న కమిటీ కుర్రోళ్లు సినిమా ప్రమోషన్స్ లో భాగంగా విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధాం ఇచ్చింది. తన తండ్రి నాగబాబు అన్ని విషయాలపై ట్వీట్ చేస్తుండాలని, అన్నింటినీ తాను చూడనని, తనకు తెలియదని చెప్పింది.

ప్రతిరోజు వాట్సాప్ లో కూడా ఏదో ఒక సుత్తి పెడుతుంటాడని, ఎవరు ట్వీట్ చేసినా వారి వారి అభిప్రాయాలు వారికి ఉంటాయని, ఆయన ఏం పోస్ట్ చేశారో, దానికి కారణమేంటో తనకు తెలియదని నీహారిక చెప్పింది. ఎవరికి నచ్చినట్లు వారు ఉండొచ్చని, ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయని, అయితే కుటుంబానికే మొదటి ప్రాధాన్యత అనేది తన అభిప్రాయమన్నారు. వేరేవాళ్ల అభిప్రాయం గురించి మాత్రం తానేం చెప్పలేనని వ్యాఖ్యానించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+