ఎలక్షన్స్ కోసం బాలకృష్ణ పొలిటికల్ మూవీ?
భగవంత్ కేసరి సినిమాతో సూపర్ హిట్ కొట్టిన నందమూరి బాలకృష్ణ తన తర్వాత సినిమాకు సిద్ధమవుతున్నారు. బాబీ దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ దీన్ని నిర్మిస్తున్నారు. దసరా విన్నర్ గా నిలిచి మంచి జోష్ మీదున్న బాలయ్య సరసన ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నారు. చాందినీ చౌదరి, ఊర్వశీ రౌతెలా బాలకృష్ణ సరసన ఆడిపాడనున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ సినిమాలో బాలయ్య ఎంట్రీని చాలా గ్రాండ్ గా తీయబోతున్నారు. దీనికోసం దర్శకుడు బాబీ పకడ్బందీ ప్లానింగ్ తో ముందుకు వెళుతున్నట్లు చిత్రవర్గాలు చెబుతున్నాయి. రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్ వేస్తున్నారు. బాలయ్య, విలన్ల మధ్య ఈ సెట్ లోనే యాక్షన్ సీన్లు తీయబోతున్నారు. సినిమా మొత్తానికి ఈ సన్నివేశాలు హైలైట్ అవుతాయంటున్నారు. బాలయ్య అభిమానులకు నచ్చే ఎన్నో సన్నివేశాలు ఈ సినిమాలో ఉండబోతున్నాయి.

రవితేజ, ఎన్టీఆర్, పవన్‌కల్యాణ్, చిరంజీవి, వెంకటేష్, నాగచైతన్య వంటి హీరోలతో సినిమాలు చేసిన బాబీ తొలిసారిగా బాలకృష్ణతో కలిసి పనిచేయబోతున్నారు. దీనిపై అభిమానులతోపాటు తెలుగు ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలున్నాయి. దానికి తగ్గట్టుగానే బాలయ్య మార్క్ యాక్షన్‌కు ఏమాత్రం సంబంధం లేకుండా.. ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్‌తో సాగే ఎమోషనల్ డ్రామాగా ఈ సినిమాను తీస్తున్నారు. ఈ సినిమాలో పాలిటిక్స్ నేపథ్యంలో ఓ ఫ్లాష్ బ్యాక్ ఉంటుందని, బాలయ్య డ్యూయల్ రోల్‌లో కనిపించబోతున్నాడని సమాచారం. ఏపీ అసెంబ్లీకి త్వరలోనే ఎన్నికలు జరగబోతున్నాయి. వీటిని దృష్టిలో ఉంచుకొని రాజకీయంగా ఉపయోగపడేలా ఇందులోని ఎపిసోడ్ ఉండబోతోందంటున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు












Click it and Unblock the Notifications