పళ్లు రాలగొడతా? ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడు: బాలకృష్ణ

నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం కొల్లి బాబీ దర్శకత్వంలో తన 109వ సినిమా చేస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి దీన్ని విడుదల చేయబోతున్నారు. ఈలోగా ఆయన తనయుడు మోక్షజ్ఞ సినీ అరంగ్రేటం చేశారు. తన జన్మదినోత్సవమైన సెప్టెంబరు ఆరోతేదీన ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఈ చిత్రం ప్రారంభం కావడంపై బాలయ్య ఆనందంగా ఉన్నారు. తొలిసారిగా బాలయ్య సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి గత నెల 30వ తేదీకి 50 సంవత్సరాలు పూర్తిచేసుకున్నారు. ఈ సందర్భంగా చిత్ర పరిశ్రమ ఆయన్ను ఘనంగా సత్కరించింది.

పళ్లు రాలగొడతా
హైదరాబాద్ నోవాటెల్ లో జరిగిన ఈ వేడుకకు సినీ, రాజకీయ రంగాలకు చెందిన అతిరథ మహారథులంతా హాజరయ్యారు. ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడిన వీడియో ఒకటి వైరలవుతోంది. వాస్తవానికి ఏదో ఒక సందర్భంగా బాలయ్య చేసిన కామెంట్లు వైరలవడం సహజమే. అలాగే ఈ వీడియో కూడా సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఇందులో ఎవరికో బాలయ్య అదిరిపోయే హెచ్చరిక చేస్తున్నారు. తెలుగు సినీ పరిశ్రమలో దర్శకులు లేరని, కథలు రాసేవారు లేరని అంటే పళ్లు రాలగొడతా.. మన తెలుగులో దర్శకులు లేరా? నీకు తెలియదా? నిర్మాతలు లేరా? అద్భుతమైన సాంకేతిక నిపుణులు లేరా? కథ బాగుంటే ఎంతైనా ఖర్చుపెట్టడానికి ముందుకువచ్చే భారీ నిర్మాతలున్నారనే విషయం నీకు తెలియదా? అని ప్రశ్నించారు.

nandamuri balakrishna serious warning to unknown person in his 50 years golden jubilee event

ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడు
తెలుగు సినీ పరిశ్రమను తక్కువ చేసి మాట్లాడటం ఇకనైనా మానుకోవాలని, నేను చేసిన ఆదిత్య 369, భైరవ ద్వీపం సినిమాలు తెలుగు దర్శకులు చేయలేదా? తెలుగవారి కథతో రాలేదా? అవి ఎలాంటి విజయాన్ని అందుకున్నాయో చూశావుగా.. ఇండస్ట్రీని షేక్ చేశాయి.. నా ముందు ఇంకోసారి తెలుగులో దర్శకులు లేకపోవడం దురదృష్టకరమంటూ మాట్లాడితే సహించను. ఇకనుంచి ఈ మాటలు మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడండి.. అంటూ ఎంతో సీరియస్ గా బాలయ్య వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో వైరలవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+