పోలింగ్ ముగిశాక.. బాలయ్య రూటు మారింది
Nandamuri Balakrishna: ప్రముఖ నటుడు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ రూటు మారింది. మొన్నటివరకు ఎన్నికల ప్రచారంలో తీరిక లేకుండా గడిపిన ఆయన ఇప్పుడు బ్యాక్ టు ఫిల్మ్ ఇండస్ట్రీ అయ్యారు. సినిమాలను పూర్తి చేయడంపై దృష్టి సారించారు. కొత్త సినిమాల కథా చర్చల్లో పాల్గొంటోన్నారు.
ఈ ఎన్నికల్లో బాలకృష్ణ.. శ్రీసత్యసాయి పుట్టపర్తి జిల్లా హిందూపురం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన విషయం తెలిసిందే. ఇక్కడి నుంచి ఆయన పోటీ చేయడం వరుసగా ఇది మూడోసారి. 2014, 2019 ఎన్నికల్లో హిందూపురం నుంచి ఘన విజయం సాధించారు టీడీపీ అభ్యర్థిగా. హ్యాట్రిక్ కొట్టడానికి రెడీ అయ్యారు. ఇదెంత వరకు వాస్తవ రూపం దాల్చుతుందనేది జూన్ 4 తేలిపోతుంది.

తాజాగా- గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్‌గా హాజరు కాబోతోన్నారు నందమూరి నటసింహం. మంగళవారం సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ ఎన్ కన్వెన్షన్ సెంటర్‌లో ఈ ప్రోగ్రామ్ ఏర్పాటైంది. ఎన్నికల హడావుడి ముగిసిన తరువాత ఆయన అటెండ్ కాబోతోన్న తొలి సినిమా ఈవెంట్ ఇదే.
విష్వక్ సేన్, అంజలి, నేహా షెట్టి నటించిన మూవీ- గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. లంకల రత్నాకర్ అలియాస్ రత్నగా మాస్ క్యారెక్టర్‌లో కనిపించాడు విష్వక్ సేన్. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్‌తో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ మూవీలో కొన్ని పవర్ ఫుల్ డైలాగ్స్ పడ్డాయతనికి.
యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాకు కృష్ణ చైతన్య దర్శకుడు. నాజర్, సాయికుమార్, హైపర్ ఆది, మధునందన్.. ఇతర కీలక పాత్రలను పోషించారు. సితార ఎంటర్టైన్‌మెంట్, ఫార్చున్ ఫోర్ బ్యానర్ కింద సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య, వెంకట్ ఉప్పుటూరి దీన్ని నిర్మించారు. ఈ నెల 31వ తేదీన విడుదల కాబోతోంది.












Click it and Unblock the Notifications