ఓకే అయిన మోక్షజ్ఞ సినీ ఎంట్రీ.. దర్శకుడు ఎవరంటే!

నందమూరి నటసింహం బాలకృష్ణ నట వారసుడు మోక్షజ్ఞ తెలుగు సినీ పరిశ్రమలోకి ఎప్పుడు అడుగు పెడతాడా? అనే ఆసక్తితో అందరూ కోటి కళ్లతో ఎదురుచూస్తున్నారని చెప్పొచ్చు. నందమూరి అభిమానులైతే ఎప్పుడెప్పుడు అతను పరిశ్రమలోకి అడుగు పెడతాడా? అంటూ ఎంతో ఆత్రుతగా ఉన్నారు. అదిగో వస్తున్నాడు.. ఇదిగో వస్తున్నాడంటూ వార్తలు రావడం, అవి నిజం కాకపోవడంతో అభిమానులు తీవ్రంగా నిరాశ చెందుతున్నారు. అయితే వారు ఇక నిరాశ చెందాల్సిన అవసరం లేదు. వారికోసం ఒక శుభవార్త

లుక్ మారింది..
మోక్షజ్ఞ సినిమాల్లోకి రావడం రంగం సిద్ధమవుతోంది. ప్రస్తుతం కథాచర్చలు నడుస్తున్నాయి. కథ ఓకే అవగానే వెంటనే షూటింగ్ ప్రారంభమవుతుంది. ఈ విషయం బయటకు రావడంతో నిర్మాత ఎవరు? దర్శకుడు ఎవరు? హీరోయిన్ ఎవరు? అనే చర్చ సామాజిక మాధ్యమాల్లో నడుస్తోంది. బాలయ్యకు వరుసగా సూపర్ హిట్ సినిమాలను అందించిన బోయపాటి శ్రీను మోక్షజ్ఞ ను పరిచయం చేసే బాధ్యత తీసుకున్నారంటున్నారు. దీనిపై అధికారికంగా ధ్రువీకరణ రావాల్సి ఉంది. బాలయ్య వారసుడి సినీ రంగ ప్రవేశం గురించిన ఈ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

Nandamuri Mokshagna will entry telugu film industry

జ్యోతిష్యం ప్రకారం..
గతంలో బొద్దుగా ఉన్న మోక్షజ్ఞ సినిమాల కోసం తన లుక్ ను కూడా మార్చుకున్నాడు. సినిమా హీరోల్లా స్లిమ్ గా, కండలు తిరిగిన దేహంతో ఉన్నాడని సన్నిహితులు చెబుతున్నారు. ఎప్పుడోనే పరిశ్రమకు పరిచయం అవుతాడని భావించినప్పటికీ అతని జాతకం ప్రకారం ఫలానా సమయంలో పరిశ్రమలోకి ప్రవేశిస్తే బాగుంటుందని జ్యోతిష్యులు సలహా ఇవ్వడంతో, ఆ సలహా ప్రకారమే ఇప్పుడు పరిచయం చేస్తున్నారని అభిమానులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఎన్నికల హడావిడిన ముగించుకున్న బాలయ్య బాబీ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న చిత్రానికి సంబంధించిన షూటింగ్ లో పాల్గొనబోతున్నారు. హిందూపురం నుంచి బాలయ్య ఎమ్మెల్యేగా పోటీచేసిన సంగతి తెలిసిందే. వరుసగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలనే లక్ష్యంతో బాలకృష్ణ ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+