అప్పుడే ఓటీటీలోకి నాని 'ప్యారడైజ్' సినిమా.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్
నేచురల్ స్టార్ నాని- శ్రీకాంత్ ఓదెల కాంబోలో వచ్చిన ది ప్యారడైజ్ మూవీ ప్రస్తుతం థియేటర్లలో ప్రేక్షకులను అలరిస్తుంది. భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 24 ఈ మూవీ విడుదలైంది. అయితే తొలి రోజు కలెక్షన్ల వర్షం కురిపించింది నాని సినిమా. ఫస్ట్ డే ప్రపంచవ్యాప్తంగా రూ. 88 కోట్లకు పైగా గ్రాస్ వచ్చినట్లు చిత్ర బృందం అధికారికంగా తెలిపింది. నాని కెరీర్ లో ఇదే బెస్ట్ ఓపెనింగ్ అని పేర్కొంది. ఇక నాని గత సినిమాలతో పోలిస్తే ఈసారి రిలీజ్ స్కేల్ కూడా పెరిగింది. ఇక ప్యారడైజ్ సినిమాకు మిక్స్ డ్ టాక్ వచ్చింది. కానీ వీకెండ్ కావడంతో శని, ఆదివారాలు బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ నే నమోదు చేశాయి. అయితే సోమవారం నుంచి ప్యారడైజ్ మూవీకి కలెక్షన్స్ లో డ్రాప్ కనిపించినట్లు స్పష్టం అవుతోంది.
వాస్తవానికి నాని- శ్రీకాంత్ ఓదెల ది బెస్ట్ కాంబినేషన్. వీళ్లిద్దరి కాంబోలో 2023 లో వచ్చిన దసరా మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. దాంతో ప్యారడైజ్ మూవీపై భారీగా అంచనాలు నెలకున్నాయి. అందుకు తగ్గట్లుగానే మూవీ నుంచి వచ్చిన ఆయా షేర్, ఏషనాగుల పాటలు జనాల్ని ఉర్రూతలూగించాయి. ఆ తర్వాత రిలీజ్ అయిన టీజర్ కూడా చాలా కొత్తగా రా అండ్ రస్టిక్ గా ఉంది. దాంతో ఈ మూవీపై అంచనాలు ఆకాశానికి తాకాయి. ఎంతలా అంటే కనీసం ట్రైలర్ కూడా రిలీజ్ చేయలేదు. ట్రైలర్ కూడా లేకుండా డైరెక్ట్ గా థియేటర్లలోకి వచ్చిన పెద్ద సినిమా ఇటీవలి కాలంలో బహుశా ఇదే.. కానీ మూవీ బాక్సాఫీస్ వద్ద మిక్స్ డ్ టాక్ తో సరిపెట్టుకుంది. ఇక ఈ మూవీని ఎస్ఎల్వీ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.
ఇక ప్యారడైజ్ మూవీలో దర్శకుడు శ్రీకాంత్ ఓదెల సవారీ అనే జాతి తమ గుర్తింపు, అస్థిత్వం కోసం చేసే పోరాటాన్ని అద్భుతంగా చూపించారు. నేచురల్ స్టార్ నాని ఇందులో జడల్ గా కనిపించి ఆకట్టుకున్నారు. ఇక ఈ మూవీలోని పాటలు ఇప్పటికే బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. అయితే థియేటర్లలో ఈ పాటలకు ఆడియెన్స్ స్క్రీన్ వద్దకు వెళ్లి మరీ డ్యాన్స్ లు చేయడం ఆశ్చర్యం. ఇక నాని సరసన ఈ మూవీలో కయాదు లోహర్ హీరోయిన్ గా నటించింది. అలాగే కలెక్షన్ కింగ్ మోహన్ బాబు సికంజా మాలిక్ గా శక్తివంతమైన పాత్రలో రక్తి కట్టించారు. ఇక బాలీవుడ్ యాక్టర్ రాఘవ్ జుయల్ నెగిటివ్ రోల్ లో అలరించారు. మరోవైపు బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు ఫుల్ లెంగ్త్ రోల్ చేయడం విశేషం. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిచిన సంగతి తెలిసిందే.

అయితే ప్యారడైజ్ మూవీ అక్టోబర్ 22న ఓటీటీలోకి రానున్నట్లు సమాచారం అందుతోంది. ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. దాదాపు ఇదే రోజున ఓటీటీలోకి వచ్చే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి ప్యారడైజ్ మూవీ థియేటర్లలో ప్రేక్షకుల్ని అలరిస్తోంది.












Click it and Unblock the Notifications
