Nayanthara: కమల్ హాసన్ సరసన నయనతార; మణిరత్నం మరో భారీ ప్రాజెక్ట్!!
నయనతార... ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోతున్న స్టార్ హీరోయిన్ . లేడీ సూపర్ స్టార్ గా పేరు పొందిన నయనతారకు ఇటీవల జవాన్ సినిమా బిగ్ హిట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు నయనతార లోకనాయకుడితో జత కట్టటానికి రెడీ అయ్యింది. ఇప్పటివరకు మనం చూడని అరుదైన కాంబోలో నయనతార మరో భారీ ప్రాజెక్ట్ లో మెరవనుంది.
ఇప్పటివరకు కమలహాసన్ నయనతార జంటగా ఒక్క సినిమా కూడా రాలేదు. ఇక ఈ అద్భుతమైన కాంబో తో ఈ సినిమాని తెరకెక్కించడానికి రెడీ అయ్యారు దర్శక రత్న మణిరత్నం. నయనతార మణిరత్నం దర్శకత్వం వహించే ఈ సినిమాలో నటించటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే మణిరత్నం కమల్ హాసన్ కాంబోలో సినిమా ప్రకటించి చాలా రోజులు కాగా, ప్రస్తుతం ఈ సినిమాలో నయనతార ఒక ప్రధాన పాత్రలో కనిపించనున్నట్లు, అందుకు ఆమె ఓకే చేసినట్టు తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో ఐశ్వర్యరాయ్ ను ఎంపిక చేశారని పెద్దఎత్తున ప్రచారం జరిగింది. మరి ఈ సినిమాలో నయనతారను ఓకే చేయడం మరేదైనా పాత్రలోనా? లేక ఐశ్వర్యరాయ్ పాత్రలోనే నయనతార చేయనున్నారా? అన్నది మాత్రం తెలియాల్సి ఉంది.
ఈ సినిమాలో నయనతార నటిస్తుంది అన్న వార్త అధికారికంగా ప్రకటన కాకపోయినప్పటికీ , ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్ గా మారింది. అయితే మణిరత్నంతో కలిసి కమల్ హాసన్ చేస్తున్న ఈ సినిమా ఆయన కెరీర్లో 234వ సినిమాగా రూపొందబోతుంది. ఇప్పటివరకు తమిళంలో స్టార్ హీరోలు అందరితో నటించిన నయనతార ఇప్పటివరకు కమల్ హాసన్ కి జోడిగా నటించలేదు.
వీరిద్దరి కాంబోలో సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను నవంబర్ 7వ తేదీన విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తున్నట్టు సమాచారం. కొన్ని సన్నివేశాలను కూడా చిత్రీకరించినట్టు వార్తలు వస్తున్నాయి. ఇక నయనతార, కమల్ హాసన్ నటించే కేహెచ్234 సినిమా జనవరి నుంచి షూటింగ్ ప్రారంభించనున్నట్టు తెలుస్తుంది.












Click it and Unblock the Notifications