అల్లు అర్జున్ సినిమాను బ్యాన్ చేసిన ఓటీటీ
అల్లు అర్జున్ కథానాయకుడిగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో 2020 జనవరి 13వ తేదీన థియేటర్లలోకి వచ్చిన అల వైకుంఠపురం సినిమా సంచలన విజయాన్ని సాధించింది. అదే సంక్రాంతికి మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమా కూడా విడుదలైనా అల వైకుంఠపురం పైచేయి సాధించింది. అంతేకాదు.. కలెక్షన్లు కూడా భారీగా కొల్లగొట్టింది. నాన్ బాహుబలి రికార్డు సృష్టించింది. అంతకుముందు త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలు చేశారు. తర్వాత కొంత గ్యాప్ వచ్చినప్పటికీ మంచి సినిమా చేయాలనే ఉద్దేశంతో సరదాగా ఉండే సినిమా తీయాలని అల వైకుంఠపురం తీసి బ్లాక్ బస్టర్ హిట్ నమోదు చేశారు.
షాక్ కు గురైన అల్లు అర్జున్ అభిమానులు
హారిక-హాసిని క్రియేషన్స్ పతాకంపై రాధాకృష్ణ, గీత ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా విడుదలైన కొన్నాళ్లకు ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది. 2020 నుంచి ఈ సినిమా నిరాటంకంగా నెట్ ఫ్లిక్స్ లో ప్రసారమవుతోంది. తాజాగా ఈ సంస్థ అధికారికంగా ఓ ప్రకటన చేసింది. ఈ నెల 27వ తేదీ వరకు మాత్రమే నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంటుందని ప్రకటించింది. దీంతో అల్లు అర్జున్ అభిమానులు షాక్ కు గురయ్యారు. వాస్తవానికి ఇన్ని సంవత్సరాలు నిరాటంకంగా ఓ తెలుగు సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కావడం ఇదే తొలిసారి.

ఆ ఓటీటీలో మాత్రం అందుబాటులో ఉంటుంది
అయితే ఈ సినిమా శాటిలైట్ హక్కులు జెమిని టీవీ దక్కించుకుంది. ఆ ఛానల్ సినిమా వేసినప్పుడు మాత్రమే చూడాలి. అయితే ఈ సంస్థకు చెందిన ఓటీటీ సన్ నెక్ట్స్ లో మాత్రం అందుబాటులో ఉండనుంది. అల్లు అర్జున్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ఈ సినిమాలో పూజా హెగ్డే, సచిన్ ఖేడ్కర్, జయరాం, టబు, మురళీశర్మ తదితరులు నటించారు. తమన్ అందించిన సంగీతంతోపాటు బుట్టబొమ్మ, సామజవరగమన పాటలు సినిమాకు హైలైట్ గా నిలిచాయి. పుష్ప2 తర్వాత అల్లు అర్జున్ తన తర్వాత సినిమా త్రివిక్రమ్ దర్శకత్వంలోనే చేయబోతున్నారు. సోషియో మైథలాజికల్ ఫాంటసీ నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతోంది. ఈ జోనర్ లో సినిమా తీయడం అనేది కూడా త్రివిక్రమ్ కు మొదటిసారి అవుతుంది. గుంటూరు కారం లాంటి చెత్త సినిమాను మహేష్ బాబు అభిమానులకు అందించిన త్రివిక్రమ్ ఈ సినిమాకు గాడ్ ఆఫ్ వార్ అనే పేరు పరిశీలిస్తున్నారు.












Click it and Unblock the Notifications