తెలుగు ఇండస్ట్రీకి కొత్త పాప వచ్చింది!
తెలుగు సినీ పరిశ్రమ ఓవైపు హీరోయిన్ల కొరతను ఎదుర్కొంటూనే ఉండగా.. మరోవైపు మాత్రం కొత్తవారు వస్తూనే ఉన్నారు. కొంతమంది కష్టపడి తమను తాము నిరూపించుకొని పరిశ్రమలో నిలదొక్కుకుంటున్నారు. అదృష్టం కలిసివస్తే సీనియర్ హీరోల పక్కన అవకాశాలను పట్టేస్తున్నారు. కొందరికి అదృష్టం కలిసివచ్చి 10 నుంచి 15 సంవత్సరాలపాటు హీరోయిన్లుగా కొనసాగుతున్నారు.
వాస్తవానికి హీరోయిన్ల జీవితకాలం చాలా తక్కువగా ఉంటుంది. స్టార్ హీరోలు, కుర్ర హీరోలకు పెద్దగా ఇబ్బందులు లేకపోయినప్పటికీ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లాంటి అగ్ర కథానాయకులు హీరోయిన్ల కొరతను ఎదుర్కొంటున్నారు. పరిశ్రమలో 20 సంవత్సరాల నుంచి కొనసాగుతున్నవారికి వీరిపక్కన కథానాయికలుగా దర్శకులు పట్టుకొస్తున్నారు. ఇదంతా మనం ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే కొద్ది రోజులుగా సోషల్ మీడియలో ట్రెండ్ అవుతున్న పేరు ఆయేషా ఖాన్.

ఇటీవలే విడుదలైన 'ఓం భీం బుష్'లో ఆమె ఓ పాత్ర చేసింది. అంత ప్రాధాన్యం ఉన్న పాత్రేమీ కాదు. హీరోయిన్ ప్రీతి ముకుందన్ కంటే ఆయేషా ఖాన్ మీదే సినీ ప్రియులంతా ఎక్కువ దృష్టిపెట్టారు. గ్లామర్ గా ఉండటమే అందుకు కారణం. దీంతో కుర్రకారు మొత్తం ఆయేషాకు బ్రేక్ ఇవ్వాలనే ఉద్దేశంతో సోషల్ మీడియాలో ఆమె పేరును ట్రెండ్ చేస్తున్నారు.
తాజాగా విడుదలైన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'లో ఆయేషా చేసిన 'మోత మోగిపోద్ది' పాటలో క్లీవేజ్ షో ఆసక్తి కలిగించింది. ఆయేషావల్లే ఈ పాట ట్రెండింగ్ లోకి వచ్చింది. హిందీ 'బిగ్ బాస్' 17వ సీజన్లో కంటెస్టెంట్‌గా వెళ్లడం ద్వారా మంచి పేరు సంపాదించుకుంది. హాట్ హాట్ గా కనిపించే ఆయేషా టాలీవుడ్ ను ఓ ఊపు ఊపేస్తోందని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ముఖచిత్రం అనే సినిమాలో నటించి ఆయేషా.. దుల్కర్ సల్మాన్ కొత్త చిత్రం లక్కీ భాస్కర్ లో కూడా ఓ పాత్ర చేస్తోంది.












Click it and Unblock the Notifications