సినీ ప్రియులకు గుడ్ న్యూస్.. ఈ వారం థియేటర్లు, ఓటీటీల్లో సందడి చేసే సినిమాలివే!
సెప్టెంబర్ రెండో వారం సినిమా ప్రియులకు వినోదాల పంట పండనుంది. ఈ వారం థియేటర్ల సినిమాలను చూసే అభిమానులతో పాటు ఓటీటీ ప్రియులకు పండుగే అని చెప్పాలి. యాక్షన్, సస్పెన్స్ థ్రిల్లర్లతో పాటు యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్లు వంటివి ఒకే వారం 6 ఆసక్తికర సినిమాలు థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమవ్వగా.. ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలో కూడా పలు సరికొత్త చిత్రాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు రెడీ అయ్యాయి.
థియేటర్లలో అలరించబోయే సినిమాలు ఇవే..
సర్దార్ 2(సెప్టెంబర్ 10): కార్తీ హీరోగా, పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ 'సర్దార్' కు సీక్వెల్‌గా ఈ సినిమా వస్తోంది. ఇందులో మాళవిక మోహనన్, ఆషికా రంగనాథ్ కథానాయికలుగా నటించగా.. ఎస్‌జే సూర్య, రిజిషా విజయన్ కీలక పాత్రలు పోషించారు. నీళ్ల సంక్షోభం ఆధారంగా తెరకెక్కిన మొదటి భాగం కంటే 10 రెట్లు ఎక్కువ ఎఫెక్ట్ చూపించే కొత్త కాన్సెప్టుతో ఈ చిత్రం రాబోతుందని హీరో కార్తీ తెలిపారు.

మండాడి(సెప్టెంబర్ 10): సుహాస్, సూరి ప్రధాన పాత్రల్లో మతిమారన్ పుగళేంది దర్శకత్వంలో రూపొందిన సినిమా 'మండాడి'. తమిళ, తెలుగు భాషల్లో విడుదలవుతున్న ఈ సినిమా మత్స్యకారుల జీవితాల నేపథ్యంలో సాగే స్పోర్ట్స్ డ్రామా. సముద్దంరో సాగే బోట్ రేసింగ్ యాక్షన్ సీక్వెన్సులు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.
మారెమ్మ(సెప్టెంబర్ 10): మాధవ్, దీపా బాలు జంటగా మంచాల నాగరాజు దర్శకత్వం రూపొందిన సినిమా 'మారెమ్మ'. గ్రామీణ దేవత మారెమ్మ ఇతివృత్తంగా, అచ్చమైన తెలంగాణ పల్లెటూరి నేపథ్యంలో ఈ చిత్రం రూపొందింది.
మహేంద్రగిరి వారాహి(సెప్టెంబర్ 11): సుమంత్, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో సంతోష్ జాగర్లమూడి తెరకెక్కించిన చిత్రం 'మహేంద్రగిరి వారాహి'. మహేంద్రగిరి రాజకుటుంబంలో జరిగే జరిగే వరుస మరణాలు, దాని వెనకున్న వారాహి మాత శాపం, ఆ శాపాన్ని ఛేదించేందుకు హీరో చేసే సాహసాల చుట్టూ కథ తిరుగుతుంది.
ఎపిక్: ఫస్ట్ సెమిస్టర్(సెప్టెంబర్ 11): 'బేబి' వంటి బ్లాక్‌బస్టర్ సినిమా తర్వాత ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన సినిమా 'ఎపిక్: ఫస్ట్ సెమిస్టర్'. డైరెక్టర్ ఆదిత్య హాసన్ రూపొందించిన ఈ యూత్ ఫుల్ లవ్ అండ్ ఎంటర్‌టైనర్ మూవీని సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు.
హైవాన్(సెప్టెంబర్ 11): బాలీవుడ్ స్టార్స్ అక్షయ్ కుమార్, సైఫ్ అలీ ఖాన్ కాంబినేషన్లో దిగ్గజ దర్శకుడు ప్రియదర్శన్ తెరకెక్కించిన బాలీవుడ్ యాక్షన్ చిత్రం 'హైవాన్'. బొమన్ ఇరాన్, సయామీ ఖేర్, శ్రియా పిల్గాంకర్ ఇందులో కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ఓటీటీలో అలరించబోయే చిత్రాలు ఇవే..
అమెజాన్ ప్రైమ్
డ్రాన్ టుగెదర్(హాలీవుడ్)- సెప్టెంబర్ 9
రెవల్యూషనరీస్(హిందీ సిరీస్)- సెప్టెంబర్ 11
మకుటం (మూవీ)- సెప్టెంబర్ 11
నెట్‌ఫ్లిక్స్
ది టైమ్ ట్రావెలర్స్ వైఫ్ (మూవీ)- ఇప్పటికే స్ట్రీమింగ్
ఫౌదా సీజన్ 5 (వెబ్ సిరీస్) -ఇప్పటికే స్ట్రీమింగ్
హార్ట్ ఐస్ (మూవీ) -సెప్టెంబర్ 9
అనకొండ 3: ఆఫ్ స్ట్రింగ్(మూవీ)- సెప్టెంబరు 9
విశ్వనాథ్ అండ్ సన్స్(మూవీ)- సెప్టెంబర్ 11
స్టోలెన్ హార్ట్ బీట్స్(మూవీ)- సెప్టెంబరు 11
క్రూ గర్ల్ సీజన్ 1 (వెబ్ సిరీస్) -సెప్టెంబరు 10
జీ5
ఘమసాన్(మూవీ) - సెప్టెంబర్ 11
పంచనామా(వెబ్ సిరీస్) -సెప్టెంబర్ 11
జియో హాట్ స్టార్
ది పేపర్: సీజన్ 2(మూవీ) - సెప్టెంబర్ 10
ఆలీబాబా ఔర్ 40 బూత్ (సిరీస్) -సెప్టెంబర్ 11
ప్రిన్స్ ఆఫ్ మాలీవుడ్ (మలయాళం)-సెప్టెంబరు 11
జంగిల్ టేల్స్ విత్ మోగ్లీ(మూవీ) -సెప్టెంబరు 12













Click it and Unblock the Notifications
