మస్తాన్ సాయి కేసులో కొత్త ట్విస్ట్.. గవర్నర్‌కు లేఖ
మస్తాన్ సాయి వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారిన లావణ్య, రాజ్ తరుణ్‌ల కేసులో మస్తాన్ సాయి నిందితుడిగా ఉన్నారు. అయితే తాజాగా ఈ కేసులో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. మస్తాన్ సాయి కేసు వ్యవహారం ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ వద్దకు చేరింది. లావణ్య తరుఫు న్యాయవాది నాగూర్‌బాబు గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు లేఖ రాశారు. మస్తాన్ సాయి కుటుంబాన్ని గుంటూరు మస్తాన్ దర్గా ధర్మకర్తలుగా తొలగించాలని లేఖలో పేర్కొన్నారు.
మస్తాన్ దర్గా ధర్మకర్త కుమారుడైన మస్తాన్ సాయి నేరాలతో దర్గా పవిత్ర, భద్రతకు, భంగం వాటిల్లుతుందని గవర్నర్ అబ్దుల్ నజీర్ కు రాసిన లేఖలో న్యాయవాది వెల్లడించారు. మస్తాన్ సాయిపై ఇప్పటికే ఐదు క్రిమినల్ కేసులు నమోదయ్యాయని స్పష్టం చేశారు. దర్గా బాధ్యతలను ప్రభుత్వం లేదా వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో నిర్వహించాలని కోరారు.

ఇక మరోవైపు మస్తాన్ సాయి కేసులో నార్కోటిక్స్ పోలీసులు దూకుడు పెంచారు. మస్తాన్ సాయి హార్డ్ డిస్క్‌లో డ్రగ్స్ వాడకం వీడియోలు భారీగా లభించాయి. దీంతో డ్రగ్స్ తీసుకున్న వారి వివరాలను నార్కోటిక్ పోలీసులు సేకరిస్తున్నారు. గతంలోనూ మస్తాన్ సాయి, లావణ్యపై డ్రగ్స్ కేసులు ఉన్నాయి. ఇప్పటికే గుంటూరు, నెల్లూరు జిల్లాలో నార్కోటిక్ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మస్తాన్ సాయి స్నేహితుడు రాహుల్‌ను అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్స్ పార్టీలో ఉన్న ఎనిమిది మంది అమ్మాయిలు, పది మంది అబ్బాయిల వివరాలను నార్కోటిక్ పోలీసులు సేకరించే పనిలో పడ్డారు.












Click it and Unblock the Notifications