కాస్టింగ్ కౌచ్‌పై ఎన్టీఆర్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

హేమ కమిషన్ నివేదిక మలయాళ చిత్ర పరిశ్రమలో ప్రకంపనలు సృష్టిస్తోంది. మలయాళ చిత్ర పరిశ్రమలో ఉన్న లైంగిక వేధింపులు గురించి హేమా కమిషన్ షాకింగ్ విషయాలను వెల్లడించింది. సినీ పరిశ్రమలోని మహిళలను కించపరిచేలా, నిరుత్సాహపరిచేలా, భయపెట్టేలా ఉన్నాయని హేమా కమిషన్ పేర్కొంది. హేమా కమిటీపై ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఓ కమిటీని ఏర్పాటు చేశారు. తాజాగా బెంగాలీ సినీ పరిశ్రమలో కూడా లైంగిక వేధింపులు ఉన్నాయని అక్కడ స్టార్ హీరోయిన్ న్ రితాభరి చక్రవర్తి తెలపడం సంచలనంగా మారింది.

సినీ పరిశ్రమలోని పలువురు నటులు, నిర్మాతలు, దర్శకుల నుంచి మహిళా నటులకు వేధింపులు ఎదురవుతున్నాయని హీరోయిన్ రితాభరి చక్రవర్తి చెప్పుకొచ్చింది. బెంగాళీ ఇండస్ట్రీలోనూ హేమ కమిటీ లాంటి సంస్థను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం కృషి చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఎన్నో కలలు కంటూ యువ హీరోయిన్స్ ఇండస్ట్రీలోకి వస్తున్నారు. కానీ, ఇది వ్యభిచార గృహం తప్ప మరొకటి కాదని నమ్ముతున్నా. సీఎం మమతా బెనర్జీ కూడా హేమ కమిటీ లాంటి సంస్థను ఏర్పాటు చేయడంతో పాటు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరింది.

Nivetha Thomas responded on the formation of the Hema Committee

తాజాగా దీనిపై హీరోయిన్ నివేదా థామస్ సైతం స్పందించారు. మలయాళ ఇండస్ట్రీలో ఇటీవల జరిగిన లైంగిక వేధింపులు, హేమా కమిటీ నివేదికపై నివేతాను ప్రశ్నించగా, దీనిపై ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు.. నివేదా థామస్ మాట్లాడుతూ.. మలయాళ పరిశ్రమకు ఇది ఒక చేదు అనుభవం, ప్రస్తుతం జరిగే పరిణామాలను నేను నిశితంగా గమనిస్తున్నాను, హేమ కమిటీ ఏర్పాటుకు కారణమైన హేమ కమిషన్‌ను అభినందిస్తూ ఇలాంటి కార్యక్రమాలు ప్రతిచోటా అమలు చేయాలనీ నేను ఆశిస్తున్నాను, ఇది మహిళలకు మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరికీ పని ప్రదేశాలలో సురక్షితమైన వాతావరణాన్ని కల్పించడం చాలా కీలకం ఇంట్లో కంటే ఎక్కువగా వర్క్ స్పేస్‌లో ఉంటున్నాం, సో సురక్షితమైన వాతావరనం ఉండడం చాలా ముఖ్యమని నివేదా థామస్ తెలిపారు.

హీరోయిన్ సమంత సైతం దీనిపై రియాక్ట్ అయ్యారు. మలయాళ ఇండస్ట్రీలో మహిళలు పడుతున్న కష్టాలు, ఎదుర్కొంటున్న సమస్యల గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి, పలు కీలక సూచనలు చేసిన హేమ కమిషన్ పట్ల ఆనందం వ్యక్తం చేశారు. మలయాళ చిత్ర పరిశ్రమలో ఏర్పాటు చేసిన జస్టిస్ హేమ కమిషన్ చాలా బాగా పని చేసిందని ప్రశంసించారు. తెలుగు ఇండస్ట్రీలో కూడా ఇలాంటి ఓ కమిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తెలుగు ఇండస్ట్రీలో మహిళా నటీమణులు, సిబ్బంది పడుతున్న ఇబ్బందులు, ఎదుర్కొంటున్న లైంగిక వేధింపుల మీద తగిన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డిని సమంత కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+