ఎన్టీఆర్ 'డ్రాగన్' మూవీ నుంచి క్రేజీ అప్డేట్.. కొన్ని రోజుల గ్యాప్​ తోనే 2 పార్ట్స్ రిలీజ్..!

టాలీవుడ్ స్టార్ హీరో, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. వచ్చే ఏడాది జూన్ 11న డ్రాగన్ మూవీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. సలార్ తర్వాత ప్రశాంత్ నీల్.. దేవర సినిమా తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా కావడంతో డ్రాగన్ మూవీపై అంచనాలు భారీగా నెలకున్నాయి. ఇక ఈ సినిమా షూటింగ్ సమయంలో ఎన్టీఆర్‌ కు భుజానికి గాయం అయిన సంగతి తెలిసిందే. దాని కోసం ఆయన ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ చేయించుకున్నారు. ఈ మేరకు ప్రస్తుతం ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. అక్టోబర్ ఫస్ట్ వీక్ నుంచి ఎన్టీఆర్ డ్రాగన్ మూవీ చిత్రీకరణలో పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఇప్పుడు డ్రాగన్ మూవీ నుంచి మరో క్రేజీ న్యూస్ అందుతోంది. అదేంటి అంటే.. డ్రాగన్ మూవీని రెండు భాగాలుగా తీసుకురానున్నారు. అది కూడా కొన్ని నెలల గ్యాప్ లోనే రెండు పార్టులు విడుదల కానున్నాయి. దాంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. రెండు భాగాలకు సంబంధించిన కథ, పాత్రలు, కీలక సన్నివేశాలను ముందుగానే సిద్ధం చేసుకుని షూటింగ్ ను కొనసాగిస్తున్నారట. ఈ క్రమంలో షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేసి కొంచెం గ్యాప్ లోనే డ్రాగన్ పార్ట్ 1, పార్ట్ 2 లను రిలీజ్ చేసే యోచనలో చిత్ర బృందం ఉన్నట్లు స్పష్టం అవుతోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం కనిపిస్తోంది.

NTR Dragon movie viral update It will be released in two parts with only a short gap between them

ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ షూటింగ్ కు దూరంగా ఉన్నారు. అయితే హీరో లేని సన్నివేశాలను షూట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు షెడ్యూల్ కు అంతరాయం కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. డ్రాగన్ మూవీలో ఎన్టీఆర్ మునుపెన్నడూ చూడని విధంగా లూగర్ అనే శక్తివంతమైన పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీలో ఎన్టీఆర్ సరసన రుక్మిణీ వసంత్‌ కథానాయికగా నటిస్తోంది. ఇక బాలీవుడ్ స్టార్ హీరో అనిల్ కపూర్ కీలకమైన పాత్రలో మెరవనున్నారు. అలాగే బాలీవుడ్ స్టార్స్ అలియా భట్‌, షాహిద్‌ కపూర్‌ కూడా ముఖ్యమైన పాత్రలు పోషించనున్నట్టు సమాచారం. ఇక ఈ మూవీని ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌, మైత్రీ మూవీ మేకర్స్‌ సంయుక్తంగా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+