ఎన్టీఆర్ 'గాడ్ ఆఫ్ వార్' పై త్రివిక్రమ్ కీలక అప్డేట్.. ఫ్యాన్స్‌ కు పూనకాలే..!

టాలీవుడ్​ లో మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్- త్రివిక్రమ్ కాంబోకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న సంగతి తెలిసిందే. వీళ్లిద్దరి కాంబోలో 2018 లో వచ్చిన అరవింద సమేత వీరరాఘవ రెడ్డి మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ కాంబో రిపీట్ కోసం ఫ్యాన్స్ ఎంత ఆత్రుతగా ఎదురు చూస్తున్నారో తెలిసిందే. అయితే అందరి అంచనాలకు తగ్గట్లుగానే ఇటీవల ఈ క్రేజీ కాంబో రీపీట్ అవుతున్నట్లు స్పష్టతనిచ్చింది. 'గాడ్ ఆఫ్ వార్' అనే మైథలాజికల్ సినిమా చేస్తున్నట్లు అధికారిక ప్రకటన చేసింది.

ఇక ఈ సినిమా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నేపథ్యంలో ఉండబోతోందని తెలుస్తోంది. భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రం గురించి దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ లేటెస్ట్ గా కీలక అప్డేట్ అందించారు. ప్రస్తుతం ఆయన వెంకటేశ్ తో ఆదర్శ కుటుంబం సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీ ప్రొమోషన్స్ లో భాగంగా ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. సుమ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. ఎన్టీఆర్- త్రివిక్రమ్ కాంబోలో స్క్రిప్ట్ రెడీ అయిపోయిందని కానీ ఇంకా టైటిల్ పెట్టలేదని అన్నారు.

ఆదర్శ కుటుంబం సినిమా అయిన వెంటనే ఆ మూవీనే చేస్తున్నట్లు త్రివిక్రమ్ చెప్పడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ మోడ్ లో ఉన్నారు. ఇక ఈ భారీ సోషియో-ఫాంటసీ అడ్వెంచర్‌ కు సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనుండటం విశేషం. ఈ ప్రతిష్టాత్మకమైన మూవీని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై అలాగే ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌ పై నందమూరి కళ్యాణ్ రామ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ వచ్చే ఏడాది స్టార్ట్ కానున్నట్లు తెలుస్తోంది.

NTR upcoming movie God of War script is ready Trivikram grand announcement sends fans into a frenzy

ఇక ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ డ్రాగన్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరెకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. గతంలో రిలీజైన డ్రాగన్ గ్లింప్స్ అంతర్జాతీయ స్థాయిలో ఉన్న సంగతి తెలిసిందే. ఇక డ్రాగన్ మూవీ ప్రపంచవ్యాప్తంగా వచ్చే ఏడాది జూన్ 11 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ షూటింగ్ అనంతరం ఎన్టీఆర్.. త్రివిక్రమ్ సినిమాలో నటించనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+