అల్లు అర్జున్‌కు అండగా నిలిచిన ఏకైక హీరోయిన్
స్టార్ హీరో అల్లు అర్జున్ 'పుష్ప-2' సినిమా ప్రీమియర్ షో రోజున ఎటువంటి సమాచారం లేకుండా సంధ్య థియేటర్ దగ్గరకు వెళ్లడంతో అక్కడ భారీ జనసందోహం ఏర్పడింది. ఈక్రమంలో రేవతి అనే మహిళ మరణించారు. ఈ ఘటనలో రేవతి కుమారుడు శ్రీతేజ్‌కు తీవ్ర గాయాలయ్యాయి.దీంతో అల్లు అర్జున్‌తో పాటు, సంధ్య థియేటర్ యాజమాన్యంపై కూడా కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. భారీ ట్విస్ట్‌ల మధ్య అల్లు అర్జున్ బెయిల్‌పై బయటకు వచ్చారు. 4 వారాల మధ్యంతర బెయిల్‌తో పాటు, రూ.50 వేల పూచీకత్తుతో పర్సనల్ బాండ్ మీద విడుదల చేయడం జరిగింది.
అయినప్పటికి ఈ వివాదం ముగియలేదు. థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో మహిళ మరణించిన ఘటనను కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి, అసెంబ్లీ సాక్షిగా తెలుగు అల్లు అర్జున్‌తో పాటు, ఇండస్ట్రీ పెద్దలపై విమర్శలు గుప్పించారు. తాను సీఎంగా ఉన్న సమయంలో ఇక మీదట ప్రీమియర్స్‌కు, టికెట్ల రేట్ల పెంపు ఉండదని అనుమతి ఇవ్వబోనని తేల్చిచెప్పారు. అయితే సంధ్య థియేటర్ దగ్గర ఘటనలో అల్లు అర్జున్ తీరుపై సర్వత్ర విమర్శలు వినిపిస్తున్నాయి. రేవతి మరణానికి అల్లు అర్జునే కారణమని ప్రభుత్వం విమర్శలు గుప్పిస్తోంది.

తెలుగు ఇండస్ట్రీ నుంచి చాలామంది అల్లు అర్జున్‌కు మద్దతుగా నిలిచారు. అయితే ఈ ఘటనపై హీరోయిన్లు పెద్దగా రియాక్ట్ కాలేదు. తాజాగా ఓ హీరోయిన్ అల్లు అర్జున్ ఘటనపై స్పందించింది. ఈ విషయంలో హీరోయిన్ సంజనా గల్రానీ అల్లు అర్జున్‌కు మద్దతుగా నిలిచారు. తొక్కిసలాట ఘటనకు అల్లు అర్జున్ బాధ్యులు కారని వ్యాఖ్యానించారు. ఆయన నిందితుడు కాదని తెలిపారు. కావాలని ఆ కేసులో నిందితుడిగా చేర్చారని ఆరోపించారు. తెలుగు రాష్ట్రాల్లో సినీ హీరోలకు వేరే లెవెల్ ఫ్యాన్స్ ఉన్నారని, వాళ్లది అభిమానం కాకుండా పిచ్చి అని చెప్పవచ్చని అన్నారు. ఆ థియేటర్‌కు హీరో రావడం ఇదేం మొదటిసారి కాదని తెలిపారు. మొత్తంగా ఘటనకు బన్నీ బాధ్యులు కాదని తెలిపారు.ఇప్పటి వరకు ఎవరూ కూడా ఈ విధంగా బన్నీకి సపోర్టు చేసింది లేదు.












Click it and Unblock the Notifications