ఫైనల్ గా కామన్వెల్త్ లో భారత్ స్థానం ఇదీ.. !!

స్కాట్లాండ్ గ్లాస్గో వేదికగా సాగిన కామన్వెల్త్ క్రీడల్లో భారత అథ్లెట్లు నూతన అధ్యాయాన్ని లిఖించారు. పతకాల వేటను విజయవంతంగా ముగించారు. ఈ మెగా టోర్నీలో భారత క్రీడాకారులకు సాంప్రదాయకంగా గట్టి పట్టున్న కొన్నింటిని తుది జాబితా నుంచి నిర్వాహకులు తొలగించినప్పటికీ, మన అథ్లెట్లు ఏమాత్రం వెనకడుగు వేయలేదు. పతకాల పట్టికలో దేశాన్ని తొలి అయిదు స్థానాల్లో నిలబెట్టారు. తమ సత్తా చాటారు.

కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ మొత్తం 39 పతకాలను తన ఖాతాలో వేసుకుంది. ఇందులో బంగారు- 13, రజతం- 17, కాంస్యం- 9 ఉన్నాయి. గట్టి పోటీ ఉన్న పలు విభాగాల్లో భారత అథ్లెట్లు తమ నైపుణ్యాన్ని నిరూపించుకున్నారు. కామన్వెల్త్ క్రీడల చరిత్రలో ఎప్పట్లాగే ఆస్ట్రేలియా తన తిరుగులేని ఆధిపత్యాన్ని ఈసారి కూడా కొనసాగించింది. మొత్తం 171 పతకాలను కైవసం చేసుకుంది. ఇందులో 70 స్వర్ణ పతకాలు ఉన్నాయి. పతకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.

India Ends 2026 Commonwealth Games With 39 Medals to Finish Fourth Australia Dominates Again

ఇంగ్లాండ్ 110 పతకాలతో రెండో స్థానాన్ని, కెనడా 62తో మూడో స్థానాన్ని దక్కించుకున్నాయి. ఆతిథ్య దేశమైన స్కాట్లాండ్ కూడా సరిగ్గా భారత్‌తో సమానంగా నిలిచింది. 39 పతకాలను గెలుచుకుంది. రజత పతకాల సంఖ్యా పరంగా స్కాట్లాండ్ వెనుకంజలో ఉండటం వల్ల స్థానానికే పరిమితం కావాల్సి వచ్చింది.

దేవీశ్రీ ఫస్ట్ లుక్: రాక్‌స్టార్ నుంచి అమాయక గ్రామీణ యువకుడిగా
దేవీశ్రీ ఫస్ట్ లుక్: రాక్‌స్టార్ నుంచి అమాయక గ్రామీణ యువకుడిగా

దేశానికి సాధారణంగా భారీగా పతకాలను తెచ్చిపెట్టే కొన్ని ముఖ్యమైన క్రీడా విభాగాలు ఈసారి కామన్వెల్త్ గేమ్స్ లో లేవు. ఇది పెద్ద లోటుగా పరిణమించింది. ముఖ్యంగా షూటింగ్, రెజ్లింగ్ వంటి ఆటలలో భారత్‌కు గట్టి పట్టు ఉన్న విషయం తెలిసిందే. ఈ సారి కామన్వెల్త్ గేమ్స్ లో ఇవి లేవు. అయినప్పటికీ.. ఇతర విభాగాల్లోని అథ్లెట్లు అద్భుతంగా రాణించారు. బాక్సింగ్, అథ్లెటిక్స్, జూడో కేటగిరీల్లో అంచనాలను మించి రాణించారు. పారా స్పోర్ట్స్, వెయిట్ లిఫ్టింగ్‌లో సరికొత్త రికార్డులను నెలకొల్పారు.

వాస్తు ప్రకారం మెట్ల కింద ఎంతమాత్రం ఉంచకూడని వస్తువులు
వాస్తు ప్రకారం మెట్ల కింద ఎంతమాత్రం ఉంచకూడని వస్తువులు

వేర్వేరు భౌగోళిక, వాతావరణ పరిస్థితులను సమర్థవంతంగా తట్టుకుంటూ, ప్రత్యర్థుల వ్యూహాలను చిత్తు చేస్తూ భారత అథ్లెట్లు సాధించిన పతకాల వెనుక ఎంతో కఠోర శ్రమ దాగి ఉంది. దీని తర్వాత జరగబోయే ఆసియా గేమ్స్, ఒలింపిక్స్ వంటి ప్రతిష్టాత్మక క్రీడల సన్నద్ధతకు ఉపయోగపడే అత్యుత్తమ రోడ్ మ్యాప్‌ను సిద్ధం చేశాయి. కోచ్‌ల వ్యూహాలు, అథ్లెట్ల కఠిన శిక్షణ ద్వారా ఈ విజయం సాధ్యమైంది.

ముగింపు వేడుకలు గ్రాండ్ గా సాగాయి. ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్ తన పాటలతో అలరించారు. క్లోజింగ్ సెరిమనీ మార్చ్ లో బాక్సర్ జాస్మిన్ లాంబోరియా దేశ పతాకాన్ని రెపరెపలాడించారు. టీమ్ ను లీడ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+