ఈ నెల 8న మన్యం బంద్: ఆదివాసీ సంఘాలు పిలుపు
గిరిజనుల హక్కుల పరిరక్షణే లక్ష్యంగా ఈ నెల 8న మన్యం బంద్ కు పిలుపునిస్తున్నట్లు ఆదివాసీ సంఘాలు ప్రకటించాయి. గిరిజన ప్రాంతాల్లో తమ దీర్ఘకాలిక డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశాయి.
ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీలకు 100 శాతం రిజర్వేషన్ కల్పించే జీవో నం.3/2000ను పునరుద్ధరించాలని ఆదివాసీ సంఘాలు డిమాండ్ చేశాయి. అలాగే 50 శాతం గిరిజన జనాభా కలిగిన గ్రామాలను షెడ్యూల్ ప్రాంతంలో చేర్చాలని అన్నాయి.

ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు వీటిపై ప్రకటన చేయాలని స్పష్టం చేశాయి. లేదంటే బంద్ ను మరింత ఉద్రిక్తం చేస్తాయని స్పష్టం చేశాయి. దీంతో మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం జిల్లాల్లో బంద్ ఉండే అవకాశం ఉంది. ఈ మేరకు వ్యాపార, వాణిజ్య, రవాణా సంస్థలు ఈ బంద్ కు సహకరించాలని సంఘాల నేతలు విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications