ఆగస్టు 5 నుంచి 17 వరకు మూడు గ్రహాల రచ్చ.. వీరికి మహారాజయోగం!

వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల సంచారం, సంయోగం అనేక శుభ యోగాలకు కారణమవుతాయి. ఆగస్టు 5వ తేదీ నుంచి 17వ తేదీ వరకు కర్కాటకరాశిలో దేవతల గురువు బృహస్పతి, గ్రహాల రాకుమారుడు బుధుడు, గ్రహాలకు అధిపతి సూర్యుడు కలిసి సంచారం చేస్తారు. ఈ మూడు ముఖ్య గ్రహాల కలయిక అపూర్వమైన త్రిగ్రాహి యోగాన్ని ఏర్పరుస్తుంది. ఈ యోగం కారణంగా కొన్ని రాశులవారి జీవితంలో సానుకూలమార్పులు, అదృష్టయోగాలు వస్తాయి. .

మేషరాశి: మేషరాశిలో చతుర్థ స్థానంలో త్రిగ్రాహి యోగం ఏర్పడడం వల్ల మేష రాశి వారికి ఉద్యోగంలో పదోన్నతులు వస్తాయి. జీతం పెరుగుతుంది. ఈ సమయంలో మేషరాశి వారు అదనపు ఆదాయాన్ని సంపాదిస్తారు. నిరుద్యోగులకు ఊహించని అవకాశాలు వస్తాయి. మేష రాశి వారి ఆరోగ్యం మెరుగుపడుతుంది.

Trigrahi yoga Rare Jupiter-Mercury-Sun conjunction gives these zodiac signs good health and wealth

మిధున రాశి: మిధున రాశిలో ధన స్థానంలోత్రిగ్రాహి యోగం ఏర్పడుతుంది. దీనివల్ల మిథున రాశి వారికి ఉన్నత పదవులు వస్తాయి. వర్తక వ్యాపారాలు చేసే వారికి లాభాలు పెరుగుతాయి. విదేశాలకు వెళ్లే అవకాశం వస్తుంది. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. తండ్రి వల్ల సంపద పెరుగుతుంది.

కర్కాటక రాశి: కర్కాటక రాశిలో త్రిగ్రాహి యోగం ఏర్పడడం వల్ల వీరికి ఈ సమయంలో చాలా లాభదాయకంగా ఉంటుంది. ఆదాయం బాగా పెరుగుతుంది. విదేశాలలో ఉద్యోగ అవకాశాలు వస్తాయి. వర్తక వ్యాపారాలు చేసే వారికి బాగా కలిసి వస్తుంది.

కన్యారాశి: కన్య రాశిలో లాభ స్థానంలో త్రిగ్రాహి రాజయోగం ఏర్పడుతుంది. దీని కారణంగా వీరికి ఆదాయ వృద్ధి కలుగుతుంది. ఉన్నత పదవులు వరిస్తాయి. మంచి పెళ్లి సంబంధాలు వస్తాయి. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.

తులారాశి: తులా రాశి వారికి దశమ స్థాన ప్రభావంతో అన్ని విధాలా కలిసి వస్తుంది. విదేశాలలో ఉద్యోగాలు వస్తాయి. పదోన్నతులు కలుగుతాయి. ధన యోగాలు ఏర్పడతాయి. వ్యక్తిగత, ఆర్థిక సమస్యల నుంచి తులా రాశి వారికి ఉపశమనం లభిస్తుంది.

ఆగస్ట్ 11న ఉత్తర ఫాల్గుణిలోకి శుక్రుడు.. తులారాశితో సహా వారికి సంపదల వెల్లువ!
ఆగస్ట్ 11న ఉత్తర ఫాల్గుణిలోకి శుక్రుడు.. తులారాశితో సహా వారికి సంపదల వెల్లువ!

మకర రాశి: మకర రాశి వారికి సప్తమ స్థానంలో త్రిగ్రాహి యోగం ఏర్పడడం వల్ల ఈ సమయంలో ఏ ప్రయత్నం చేసిన విజయం సాధ్యమవుతుంది. వీరికి అదనపు ఆదాయం పెరుగుతుంది. ఆస్తి సమస్యల పరిష్కారం అవుతుంది. ఈ సమయంలో సానుకూల ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+