ఓటీటీ వీకెండ్ హంగామా.. కాజల్ అగర్వాల్ సస్పెన్స్ థ్రిల్లర్ సత్యభామ వచ్చేసిందోచ్

కాజల్ అగర్వాల్.. తేజ నిర్మించిన లక్ష్మీ కళ్యాణం చిత్రం ద్వారా 2007లో తెలుగు చిత్ర పరిశ్రమల అరంగేట్రం చేసిన హీరోయిన్. 2009లో రామ్ చరణ్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో మగధీర చిత్రంతో కాజల్ కు బ్రేక్ లభించింది. ఆ తర్వాత కాజల్ చిత్ర పరిశ్రమలో వెనక్కి తిరిగి చూడలేదు. వరుస సినిమాలతో టాప్ హీరోయిన్ గా స్థానం సంపాదించింది. అయితే పెళ్లయిన తర్వాత కాజల్ అగర్వాల్ మళ్ళి సినిమాలలో రీఎంట్రీ ఇచ్చి వరుసగా సినిమాలను చేస్తుంది.

సస్పెన్స్ థ్రిల్లర్ సైలెంట్ మూవీగా కాజల్ నటించిన సత్యభామ
భగవంత్ కేసరితో మొదలై , ఇండియన్ టు, ఉమా, సత్యభామ సినిమాలు కాజల్ ఖాతాలో ఉన్నాయి అయితే తాజాగా కాజల్ మెయిన్ లీడ్ లో నటించిన సత్యభామ చిత్రం జూన్ 7వ తేదీన థియేటర్లలోకి వచ్చింది. సినిమా చూసిన వాళ్లంతా కాజల్ ఈ సినిమాలో బాగా నటించిందని కితాబిచ్చారు. ఒక సస్పెన్స్ థ్రిల్లర్ సైలెంట్ మూవీగా కాజల్ నటించిన సత్యభామ చిత్రం ప్రస్తుతం ఓటీటీలోకి వచ్చేసింది.

OTT Weekend Hungama Kajal Aggarwal Suspense Thriller Satyabhama

ఓటీటీ లో విడుదలై హంగామా చేస్తున్న సత్యభామ
పోలీస్ ఆఫీసర్ గా కాజల్ మెయిన్ లీడ్ లో నటించిన ఈ చిత్రంలో కాజల్ కు జంటగా నవీన్ చంద్ర నటించారు ప్రకాష్ రాజ్, హర్షవర్ధన్, నేహా పటాన్, పాయల్ రాధాకృష్ణ ప్రధాన పాత్రలో నటించారు. సుమన్ చిక్కాల దర్శకత్వంలో మేజర్, గూడచారి చిత్రాల దర్శకుడు శశికిరణ్ తిక్క ఈ సినిమాను నిర్మించారు. ప్రస్తుతం ఓటీటీ లో విడుదలై హంగామా చేస్తున్న సత్యభామ సినిమా విషయానికి వస్తే

సత్యభామ కథ ఇదే
హైదరాబాద్ షీ టీమ్ ని లీడ్ చేస్తుంది ఏసీపీ సత్యభామగా కాజల్ అగర్వాల్. ఒకరోజు తన దగ్గరికి వచ్చిన హసీనా అనే యువతి తన భర్త హింసిస్తున్నాడని ఫిర్యాదు చేస్తుంది. దీంతో సత్యభామ హసీనా భర్తను కొట్టి, గట్టి వార్నింగ్ ఇచ్చి హసీనాను పంపుతుంది. అయితే పోలీసులకు ఫిర్యాదు చేసిందని కోపంతో హసీనాపై భర్త దాడి చేస్తాడు. అది తెలిసి సత్యభామ వచ్చే సమయానికి హసీనా మృతి చెందుతుంది.

స్ట్రీమింగ్ ఎక్కడంటే
హసీనా చావుకు కారణమైన భర్తను పట్టుకోవాలని సత్యభామ చేసే ప్రయత్నాలతో ఆమెకు ఈ కేసులో అనేక కీలక విషయాలు వెలుగులోకి వస్తాయి. ఇక ఈ కేసును సత్యభామ ఎలా ఛేదించింది.. చివరకు ఈ స్టోరీలో ఏం జరిగింది అనేది కథాంశం. ప్రేక్షకులు ఊహించని ట్విస్టులతో ఈ సినిమా ఆకట్టుకుంటుంది. కాజల్ అగర్వాల్ నటించిన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కు వచ్చింది. థియేటర్ కు వెళ్లి చూడలేని వారంతా ఓటిటి ప్లాట్ ఫామ్ లో ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేయండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+