పద్మ విభూషణ్ చిరంజీవి జీవిత ప్రస్థానం!!
మెగాస్టార్ చిరంజీవి.. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అత్యున్నత పురస్కారాలలో ఒకటైన పద్మ విభూషణ్ పురస్కారాన్ని చిరంజీవి అందుకోబోతున్నారు. నటుడిగా ఎంతో మంది అభిమాన గణాన్ని సొంతం చేసుకున్న చిరంజీవి, సామాజిక కార్యక్రమాలలోనూ విశేషంగా కృషి చేస్తున్నారు. 2006లో పద్మభూషణ్ అందుకున్న చిరంజీవి తాజాగా పౌర పురస్కారాలలో రెండో అత్యున్నతమైన పురస్కారమైన పద్మ విభూషణ్ ను దక్కించుకున్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి జీవిత ప్రస్థానాన్ని ఒకసారి చూద్దాం.
1955 ఆగస్టు 22వ తేదీన చిరంజీవి జన్మించారు. ఆయన అసలు పేరు కొణిదల శివశంకర వరప్రసాద్. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో ఓ సాధారణ మధ్యతరగతి కుటుంబంలో చిరంజీవి జన్మించారు. చిన్నప్పటి నుంచి డాన్స్, నటన అంటే ఎంతో ఆసక్తిని కనబరిచిన చిరంజీవి హైస్కూల్లో, కళాశాలలో చదువుకునే రోజుల్లోనే అనేక నాటికలలో బహుమతులు అందుకున్నారు. ఇక చిన్నప్పటినుంచి సినిమాలపై ఆసక్తి ఉన్న చిరంజీవి సినిమాల్లోకి వెళ్లడం ఎలా అని ఆలోచించారు.

డిగ్రీ పూర్తి చేసిన తర్వాత సినిమాలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో నటనలో శిక్షణ కోసం ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ కు అప్లికేషన్ పంపించగా ఇంటర్వ్యూ కు రావాలని లేఖ వచ్చింది. అది చూసిన చిరంజీవి తండ్రి ఆగ్రహంతో సినిమాలలో నటులకు ఉండే సాధక బాధకాలను చెప్పి వెళ్ళొద్దని వారించారు. అయినప్పటికీ నటన పైన ఆసక్తి ఉన్న చిరంజీవి మద్రాసు రైలెక్కి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఇంటర్వ్యూకు హాజరై శిక్షణకు ఎంపికయ్యారు.
ఆ సమయంలో ఇంటర్వ్యూ కి వెళ్లిన హరిప్రసాద్, సుధాకర్ లతో కలిసి ఓ గదిలో చిరంజీవి ఉండేవారు. శిక్షణ కాలంలోనే చిరంజీవికి పునాదిరాళ్లు సినిమాలో నటించే అవకాశం లభించింది. దీంతో ఆ ఆనందాన్ని తన కుటుంబంతో పంచుకోవడానికి మొగల్తూరు వెళ్లిన శివశంకర వరప్రసాద్ అప్పుడు తన పేరును చిరంజీవిగా మార్చుకున్నాడు. చిరంజీవికి మొదట అవకాశం వచ్చిన పునాదిరాళ్లు సినిమా చిత్రీకరణ కొంతకాలం బ్రేక్ పడింది .
అదే సమయంలో ప్రాణం ఖరీదు సినిమాకు ఎంపికైన చిరంజీవి ఆ సినిమాలోని నటించారు. పునాది రాళ్లు కంటే ప్రాణం ఖరీదు సినిమా ముందు రిలీజ్ అయింది.ఇక ఆ సినిమా చూసిన ప్రముఖ దర్శకులు బాపు, కే బాలచందర్ మన ఊరి పాండవులు, ఇది కథ కాదు సినిమాలలో అవకాశం ఇవ్వడంతో చిరంజీవి సినీ ప్రస్థానం ప్రారంభమైంది.

ఇక మొదట ఏ సినిమాలో చిన్న చిన్న పాత్రలు వచ్చినా, నెగటివ్ రోల్స్ వచ్చినా ప్రతి పాత్రను నటించేవారు. ఆ తర్వాత తన డాన్స్ తో, తన నటన కౌశలంతో తెలుగు సినీ పరిశ్రమలో తనదైన స్థానాన్ని సంపాదించుకున్నారు చిరంజీవి. ఖైదీ ముందు చిరంజీవి చేసిన సినిమాలు ఒక ఎత్తు అయితే ఖైదీ సినిమా, ఆ తరువాత చిరంజీవి చేసిన సినిమాలు మరో ఎత్తని చెప్పాలి.
తొలి నాళ్ళలో సుప్రీం హీరోగా ప్రేక్షకులందరినీ మెప్పించిన చిరంజీవి తర్వాత మెగాస్టార్ అయ్యారు. ఆ తర్వాత చేసిన సినిమాలన్నీ ఆయనకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. 1990లలో అత్యధిక పారితోషకం తీసుకున్న తొలి భారతీయ నటుడిగా చిరంజీవి గుర్తింపు పొందారు. ఆ రోజుల్లోనే ఆయన సినిమాకు కోటి రూపాయల వరకు పారితోషికం తీసుకున్నారు అంటే చిరంజీవికి ఉన్న డిమాండ్ అలాంటిది.

ఇక రాజకీయాల్లోనూ కేంద్ర మంత్రిగా పని చేసిన చిరంజీవి తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. 1999-2000 సంవత్సరంలో అత్యధిక పన్ను చెల్లించిన వ్యక్తిగా సమ్మాన్ అవార్డును పొందారు. మూడుసార్లు ఉత్తమ నటుడిగా నంది పురస్కారాన్ని, 9 ఫిల్మ్ ఫేర్ అవార్డులను, రఘుపతి వెంకయ్య నాయుడు అవార్డును, 2022 సంవత్సరానికి గాను ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డును, పద్మభూషణ్ అవార్డును పొందిన చిరంజీవి తాజాగా పద్మ విభూషణ్ చిరంజీవిగా మనందరి ముందు సగర్వంగా నిలబడ్డారు.
-
కేంద్రం సంచలన ప్రతిపాదన, దగ్గు మందు బ్యాన్! -
తెలుగులో ప్రింటు ఖర్చులు కూడా రాలేదుగా అన్నా.. -
Tamil Nadu Election: రూటు మార్చిన విజయ్-సర్వేలు తేడా కొడుతున్న వేళ..! -
IPL 2026: ఆర్సీబీని వీడియో గేమ్ ఆడిన బుడ్డోడు.. నోరెళ్లబెట్టిన కోహ్లీ! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!!












Click it and Unblock the Notifications