'OG' హిట్ అని ఊదరగొట్టారు.. డిస్ట్రిబ్యూటర్లు లబో దిబో
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే అత్యంత స్టైలిష్ చిత్రంగా వచ్చిన 'ఓజీ' (OG) బాక్సాఫీస్ వద్ద తొలి రోజు రికార్డుల సునామీ సృష్టించినా, బయ్యర్ల పరిస్థితి మాత్రం ఆందోళనకరంగా ఉంది! ఏడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 343 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ అధికారికంగా ప్రకటించినప్పటికీ, కొన్ని కీలక ఏరియాల్లో ఈ సినిమా ఇంకా బ్రేక్ ఈవెన్ చేరుకోలేకపోయింది.
'ఓజీ' తొలి రోజు రూ. 154 కోట్లకు పైగా వసూలు చేసి పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది. అయితే, ఆంధ్రా ఏరియాలో పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం... విశాఖ, ఈస్ట్, వెస్ట్ గోదావరి, కృష్ణా, నెల్లూరు వంటి కోస్తా ఏరియాల్లో డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలు తప్పవని తెలుస్తోంది.

డిస్ట్రిబ్యూటర్లు దసరా సెలవులను దృష్టిలో ఉంచుకుని సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ముఖ్యంగా నైజాం, గుంటూరు ఏరియాల్లో బ్రేక్ ఈవెన్‌కు దగ్గరగా రావడంతో, వీకెండ్‌లో వసూళ్లు పుంజుకుని సేఫ్ జోన్‌లోకి వస్తామని ఆశించారు.
'ఓజీ' కలెక్షన్ల రికవరీకి ప్రధాన అడ్డంకిగా మారింది రిషబ్ శెట్టి నటించిన 'కాంతార చాప్టర్ 1'. ఈ సినిమాకు అద్భుతమైన, యూనానిమస్ పాజిటివ్ టాక్ రావడంతో, దసరా వీకెండ్‌ను పూర్తిగా కైవసం చేసుకుంది. సోషల్ మీడియాలో కూడా 'కాంతార 1' గురించే చర్చ జరుగుతుండటంతో, 'ఓజీ' వసూళ్లు భారీగా తగ్గిపోయాయి.
దీనికితోడు, 'ఓజీ'కి A సర్టిఫికెట్ రావడం వల్ల ఫ్యామిలీ ప్రేక్షకులు దూరమయ్యారు. ఒకవైపు బ్రేక్ ఈవెన్ భారం, మరోవైపు 'కాంతార 1' ప్రభంజనం.. వెరసి 'ఓజీ' బయ్యర్ల పరిస్థితి ముందు నుయ్యి, వెనుక గొయ్యి అన్న చందంగా తయారైంది.
ప్రస్తుతం ఉన్న ట్రెండ్‌ను బట్టి చూస్తే, రెండు తెలుగు రాష్ట్రాల్లో 10 నుంచి 20 శాతం వరకు నష్టాలు తప్పవని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పవన్ కళ్యాణ్ స్టార్‌డమ్ తొలి వారం వసూళ్లలో అద్భుతమైన దూకుడు చూపించినా, 'కాంతార చాప్టర్ 1'కి బ్లాక్‌బస్టర్ టాక్ రావడం 'ఓజీ'కి తీవ్ర కష్టంగా మారింది.
మొత్తం మీద, పవర్ స్టార్‌డమ్‌ను మించిన కంటెంట్ పవర్‌ను 'కాంతార 1' చూపించడంతో, 'ఓజీ' బయ్యర్లు ఆంధ్రా ఏరియాలో బ్రేక్ ఈవెన్ చేరుతారా, లేక నష్టాల పాలవుతారా అన్నది రాబోయే కొద్ది రోజుల్లో తేలనుంది.












Click it and Unblock the Notifications